Trending Video: దేవుడా..మా అమ్మను కొట్టు..చిన్నారి పూజ చూస్తే నవ్వాగదు

Trending Video: చిన్నారులు చేసే పనులు చూస్తే భలే ముద్దుగా ఉంటాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒక వీడియోలో ఒక చిన్నారి ఏడుస్తూ తన తల్లిపై దేవుడికి కంప్లైంట్ చేస్తోంది

KVD Varma
Published on: 19 March 2026 7:36 PM IST
Trending Video: చిన్నారులు చేసే పనులు చూస్తే భలే ముద్దుగా ఉంటాయి.
X

Trending Video

Trending Video: చిన్న పిల్లలను పెంచడం ఒక పెద్ద టాస్క్. ప్రతిరోజూ చిన్నారులను పెంచడంలో రకరకాల సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళ ముద్దు మాటలకూ మురిసిపోవాలో.. చేసే అల్లరి పనులకు వచ్చే చికాకును ఎలా దాచుకోవాలో.. వారిని కోప్పడాలా.. అసలు ఏం చేస్తే ఏమవుతుందో తెలీని పరిస్థితి. మరీ ముఖ్యంగా 2 నుంచి 5 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్ని పెంచాలంటే సర్కస్ లో రింగ్ మాస్టర్ లా అయిపోతుంది పరిస్థితి.

పిల్లలను అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఎప్పుడు ఏడుస్తారో.. ఎప్పుడు నవ్వుతారో.. అసలు ఎందుకు ఎలా రియాక్ట్ అవుతారనేది సరిగ్గా తెలిసిన తల్లిదండ్రులు దాదాపుగా ఉండరనే చెప్పవచ్చు. ఇక ఈమధ్య కాలంలో మొబైల్ ఫోన్స్.. సోషల మీడియా ప్రాచుర్యం పెరిగిపోయాకా.. తమ చిన్నారులు చేసే చిలిపి పనుల దగ్గర నుంచి అల్లరి పనుల వరకూ అన్నిటినీ వీడియోలు తీసి ప్రపంచంతో పంచుకుంటున్నారు చాలామంది. అలాంటి వీడియోల్లో పిల్లలను.. వారి చేష్టలను చూస్తే.. మనకు భలే సరదా అనిపిస్తుంది. ఒక్కో వీడియోలో పిల్లలు చేస్తున్న పనులకు వారి తెలివితేటలకు ఆశ్చర్యపోతాం.

పిల్లల అల్లరి భరించలేని తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు సహనం కోల్పోయి వారిని తిట్టడమో.. చిన్నగా ఒక్కటి వేయడమో చేస్తారు. దీంతో పిల్లలు పెద్దోళ్లపై అలగడం.. కోపగించుకోవోడం వంటి పనులు చేస్తారు. కొంతమంది పెద్దగా ఏడుపు అందుకుని ఎవ్వరి మాటా వినకుండా దొర్లుతూ ఉంటారు. మరి కొందరు ఇంటిలో తాత, మామ్మ ఉంటే వారికి కంప్లైంట్ చేస్తారు. ఇదిగో ఇప్పుడు మీకు ఇక్కడ ఒక వీడియో చూపిస్తున్నాం చూడండి.


ఇందులో పాప ఏమి చేస్తోందో చూశారుగా.. వాళ్ళ అమ్మ తిట్టిందో.. కొట్టిందో మరి ఆ విషయాన్నీ ఏడ్చుకుంటూ దేవునికి చెప్పుకుంటోంది. తన తల్లిని పనిష్ చేయమని కంప్లైంట్ చేస్తోంది. ఒక పక్క ఏడుస్తూనే దేవునికి దణ్ణం పెడుతూ వచ్చి రాని మాటల్తో మనకు అర్ధంకాని చిన్నారుల భాషతో గట్టిగానే కంప్లైంట్ చేస్తోంది.

లవ్‌కుష్ యాదవ్ బాబా అనే ఫేస్ బుక్ ఎకౌంట్ లో కనిపించింది ఈ వీడియో.

ఈ వీడియోలో చిన్నారి దేవునికి చేస్తున్న కంప్లైంట్ చూస్తే చాలా క్యూట్ అనిపిస్తోంది. మరోపక్క ఆ చిన్నారికి వచ్చిన కష్టానికి జాలి వేస్తోంది. అయ్యో చిన్నారి అనిపిస్తుంది. ఈ వీడియో చూసిన వారు అందరూ అలాగే స్పందిస్తున్నారు. కామెంట్స్ చేస్తున్నారు.

KVD Varma

KVD Varma

Next Story