Big Debate: తెలంగాణలో ‘అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్’ రాజకీయం: బీఆర్‌ఎస్ నేత లక్ష్మీనరసింహ రెడ్డి
Big Debate: కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలపై హెచ్‌ఎంటీవీ బిగ్ డిబేట్.
Big Debate: తెలంగాణలో ‘అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్’ రాజకీయం: బీఆర్‌ఎస్ నేత లక్ష్మీనరసింహ రెడ్డి
Big Debate: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరుపై 'హెచ్‌ఎంటీవీ' నిర్వహించిన 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు లక్ష్మీనరసింహ రెడ్డి పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 'అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్' అన్నట్లుగా పరిస్థితులు మారాయని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్‌లో నడుస్తున్న సంక్షోభం పూర్తిగా ఆ పార్టీకి సంబంధించిన విషయమని, దీనికి తెలంగాణ ప్రజలకు గానీ, బీఆర్‌ఎస్ పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని లక్ష్మీనరసింహ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమవ్వడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ నాయకులు కావాలని ఈ డైవర్షన్ పాలిటిక్స్ తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు.




