Off The Record: తమిళ రాజకీయాల్లో 'త్రిష' సెన్సేషన్.. విజయ్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎం?
Off The Record: తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘనవిజయం సాధించిన వేళ, నటి త్రిష రాజకీయ అరంగేట్రంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Off The Record: తమిళ రాజకీయాల్లో 'త్రిష' సెన్సేషన్.. విజయ్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎం?
Off The Record: తమిళనాడు ఎన్నికల్లో హీరో, తమిళగ వెట్రి కళగం..TVK అధినేత విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. సింహం సింగిల్‌గా వస్తుందంటూ..తొలిసారి సింగిల్‌గా బరిలోకి దిగి మ్యాజిక్ ఫిగర్‌కు ఒక్క అడుగుదూరంలో నిలిచారు. అధికార డీఎంకేతోపాటు అన్నాడీఎంకేకు తళపతి దిమ్మతిరిగే షాకిచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రధానంగా బెంగాల్, ఆ తర్వాత తమిళనాడుపైనే దేశవ్యాప్త ఫోకస్ నెలకొంది. దశాబ్దాలుగా తమిళనాడును ఏలిన ద్రవిడ పార్టీలను విజయ్ మట్టికరిపించారు. రాజకీయాల్లో పోటీ చేసిన తొలిసారే సంచలనం సృష్టించిన విజయ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్‌కు అభినందనలు చెబుతున్నారు. హీరోయిన్ త్రిష.. ఏకంగా విజయ్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో త్రిష.. తమిళనాడు రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తిరుచ్చి ఈస్ట్, పెరంబూరులో టీవీకే విజయ్ గెలిచారు. దీంతో ఆయన ఒక స్థానంలో రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ స్థానంలో నటి త్రిష పోటీ చేస్తారన్న ప్రచారం రీసౌండ్ చేస్తోంది. అంతేకాదు.. త్రిష ఏకంగా డిప్యూటీ సీఎం కానుందని మరో టాక్ వైరలవుతోంది. త్రిషకు ఏదో ఒక కీలక పదవి రానుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి బలమైన కారణాలు లేకపోలేదు. ఎన్నికల ముందు త్రిష- విజయ్‌పై రూమర్స్ పెద్దఎత్తున దుమారం రేపాయి. విజయ్ భార్య విడాకుల పిటిషన్ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న పుకార్లు షికారు చేశాయి. విజయ్- త్రిష ఓ పెళ్లికి హాజరు కావడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్టయ్యింది. ఈ క్రమంలో తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపుతో ఒక్కసారిగా అందరి ఫోకస్ త్రిషపైకి మళ్లింది.
తమిళనాడు ఎన్నికల నోటిఫికేన్ రిలీజ్ అయినప్పటి నుంచీ విజయ్, త్రిషల వార్తలు ప్రతిరోజు హైలైట్ అవుతునే ఉన్నాయి. ఆ వార్తలపై నటి త్రిష అనేక సందర్భాల్లో పత్యక్షంగానో, పరోక్షంగానో స్పందిస్తునే ఉన్నారు. మరోవైపు.. త్రిష ఢిల్లీకి వెళ్లి ఏకంగా హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారన్న వార్తలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా టీవీకే టికెట్ల కేటాయింపు విషయంలో కూడా త్రిష చక్రం తిప్పారన్న పుకార్లు కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే తమిళనాడు ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం, అనూహ్యంగా టీవీకే అత్యద్భుత విజయం తళపతి ఫ్యాన్స్‌కు పెద్ద పండుగే తెచ్చినట్టయ్యంది. మరికొద్ది గంటల్లో ఫలితాలు రానున్నాయన్న వేళ త్రిష.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రిజల్ట్స్ వచ్చిన రోజే త్రిష బర్త్ డే కూడా కావడం విశేషం. శ్రీవారి దర్శనం తర్వాత చెన్నై చేరుకున్న త్రిష.. నేరుగా విజయ్ నివాసానికి వెళ్లి.. ఆయనను ప్రత్యేకంగా అభినందించడం హాట్ టాపికైంది.
టీవీకే విజయంలోనూ త్రిష ప్రముఖ పాత్ర పోషించారన్న చర్చ కూడా వినిప్తిస్తోంది. ఆ విధంగా విజయ్ పార్టీలో త్రిష నెంబర్ టూ స్థానంలో ఉన్నారన్న టాక్ లేకపోలేదు. మొత్తమ్మీద.. విజయ్ రాజీనామా చేయబోయే స్థానంలో త్రిషను బరిలోకి దించి.. టీవీకే గెలిపించుకోనుంది. అంతకుముందే త్రిషకు విజయ్ కేబినెట్‌లో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి లేదా హోంమంత్రి పదవి ఇవ్వనున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలపై విజయ్ గాని, త్రిష గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. 108 సీట్లు సాధించిన టీవీకే.. మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతుపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం పీఠంపై కూర్చోబోతున్న విజయ్.. అదే సమయానికి త్రిషకు కూడా ఏదైనా కీలక పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. నిజంగానే త్రిష రాజకీయాల్లోకి రానున్నారా..? వస్తే ఆమెకు డిప్యూటీ సీఎం కాని, హోంమంత్రి పదవి గానీ ఇస్తారా..? మరేదైనా కీలక పదవి కట్టబెడతారా..? అన్నదానిపై రానున్న రోజుల్లో మరింత క్లారిటీ రానుంది.




