Big Debate: అమిత్ షా లేఖ రాశారు.. కానీ సభకు ఎందుకు రాలేదు?: AICC నేత అంబటి రామకృష్ణ

Big Debate: పార్లమెంట్ సమావేశాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీ హాజరుకాకపోవడంపై AICC నేత అంబటి రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 13 Aug 2026 11:27 AM IST
Big Debate
X

Big Debate: అమిత్ షా లేఖ రాశారు.. కానీ సభకు ఎందుకు రాలేదు?: AICC నేత అంబటి రామకృష్ణ

Big Debate: దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్, నీట్ అక్రమాలపై సమాధానం చెప్పలేకనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ సమావేశాలకు ముఖం చాటేస్తున్నారని ఏఐసీసీ (AICC) నాయకుడు అంబటి రామకృష్ణ తీవ్రంగా ఆరోపించారు. 'hmtv' నిర్వహించిన బిగ్ డిబేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

సభ సజావుగా సాగితేనే తాము వచ్చి మాట్లాడతామంటూ హోం మంత్రి అమిత్ షా స్పీకర్‌కు లేఖ రాయడం సభాధ్యక్షుడి స్థానాన్ని అవమానించడమేనని రామకృష్ణ విమర్శించారు. సభను నిర్వహించే సత్తా స్పీకర్‌కు లేదని హోం మంత్రే స్వయంగా చెప్పినట్లు ఈ లేఖ ఉందన్నారు. సభ జరుగుతున్న సమయంలో పార్లమెంట్ చాంబర్‌లో ఉండి కూడా హోం మంత్రి, ప్రధాని లోక్‌సభలోకి రాకపోవడం స్వతంత్ర భారత చరిత్రలోనే మునుపెన్నడూ లేదని ధ్వజమెత్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story