Off The Record: గులాబీ గూడు వదిలేందుకు అలంపూర్ ఎమ్మెల్యే రెడీ?
Off The Record: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఏకైక ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్‌లో చేరుతున్నారా? సీఎం పర్యటనలో అలంపూర్ ఎమ్మెల్యే హల్‌చల్ వెనుక అసలు కథ.
Off The Record: గులాబీ గూడు వదిలేందుకు అలంపూర్ ఎమ్మెల్యే రెడీ?
Off The Record: ఆ ఉమ్మడి జిల్లాలో బీఆర్‍ఎస్ పార్టీ నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే అతను. ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు అదికార కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు కొనసాగిస్తూ వస్తుంది. ఆ ఎమ్మెల్యే కూడా బీఆర్‍ఎస్ లో నుంచి ఎగిరిపోయేందుకు సిద్దంగా ఉన్నా... అదికార పార్టీలో ఉన్న తన ప్రత్యర్థి ఒకరు మోకాళ్ళు అడ్డుపెట్టడంతో అది సాద్యం కావడం లేదు.
ఐనా ఆ ఎమ్మెల్యే మాత్రం అధికార పార్టీకి చేరువయ్యేందుకు కావల్సిన ప్రయత్నాలను చేస్తూనే ఉన్నాడట..? అటు అదికార పార్టీ కూడా ఆ ఒక్క ఎమ్మెల్యేను పార్టీలోకి లాగేసుకుంటే ఆ ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేలే అవుతారని ఆశిస్తున్నా... అది మాత్రం సాద్యం కావడం లేదట.
ఇందుకు సొంత పార్టి నేతనే కారణం కావడంతో ఏం చెయ్యాలో పాలుపోక సతమతమౌతుందట అదిష్టానం. ఇంతకీ ఆ ఎకైక బీఆర్‍ఎస్ ఎమ్మెల్యే అదికార పార్టీలో చేరతాడా..? లేడా..? ఇంతకీ ఆయన్ను అడ్డుకుంటున్నది ఎవరు..? వాచ్ దిస్ స్టోరి.




