AP Development: ఇండస్ట్రీలకు కేరాఫ్ అనకాపల్లి.. 6 లక్షల కోట్ల పెట్టుబడులు!
AP Development: AP Development: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చిత్రపటం వేగంగా మారిపోతోంది. వైజాగ్ సరిహద్దులోని అనకాపల్లి జిల్లా రాబోయే రోజుల్లో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక కారిడార్‌గా రూపుదిద్దుకోబోతోంది.
AP Development: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చిత్రపటం వేగంగా మారిపోతోంది. వైజాగ్ సరిహద్దులోని అనకాపల్లి జిల్లా రాబోయే రోజుల్లో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక కారిడార్‌గా రూపుదిద్దుకోబోతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కనెక్టివిటీ, సముద్ర తీర ప్రాంతం, డెవలప్‌మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాయంతో అనకాపల్లి ప్రాంతం దాదాపు రూ. 5 లక్షల కోట్ల నుంచి రూ. 6 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉత్తరాంధ్రకు ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుతోంది.
ఈ భారీ పారిశ్రామిక ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు సుమారు 74,000 పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పారిశ్రామిక పార్కులు, స్పెషల్ ఎకనామిక్ జోన్‌లలో (SEZ) భారీ పరిశ్రమల ఏర్పాటుతో దేశ రాజధాని ప్రాంతంలోని ‘నోయిడా’ను తలపించేలా అనకాపల్లి శరవేగంగా విస్తరిస్తోంది.
Next Story




