ఏపీలో రెడ్ బుక్ కలకలం.. వైఎస్సార్‌సీపీ ఆందోళన వెనుక అసలు కారణమేంటి?

ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ కలకలంపై విశ్లేషకుడు మస్తాన్ రావు ఘాటు వ్యాఖ్యలు.

Arun Chilukuri
Published on: 3 Sept 2026 4:15 PM IST
ఏపీలో రెడ్ బుక్ కలకలం.. వైఎస్సార్‌సీపీ ఆందోళన వెనుక అసలు కారణమేంటి?
X

ఏపీలో రెడ్ బుక్ కలకలం.. వైఎస్సార్‌సీపీ ఆందోళన వెనుక అసలు కారణమేంటి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి నారా లోకేష్ ప్రస్తావించిన 'రెడ్ బుక్' అంశం నిత్యం హాట్‌టాపిక్‌గా మారుతూనే ఉంది. రెడ్ బుక్‌పై ఎటువంటి కొత్త ప్రస్తావన లేకపోయినా, దాని పేరు వింటేనే ప్రతిపక్ష వైసీపీ వర్గాలు తీవ్రంగా ఉలిక్కిపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు బనాయించిన అధికారులు, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారి పేర్లు ఈ బుక్‌లో ఉన్నాయని లోకేష్ గతంలోనే స్పష్టం చేశారు.

తాము ఎలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం లేదని, చట్టాన్ని ఉల్లంఘించి అరాచకాలకు పాల్పడిన వారినే చట్టబద్ధంగా న్యాయస్థానాల ద్వారా శిక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే, తమ పాలనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు వైసీపీ నేతలు సైతం 'బ్లూ బుక్' లేదా 'డెత్ బుక్' అంటూ ప్రతివ్యూహాలు రచిస్తున్నప్పటికీ, రెడ్ బుక్ ప్రభావం మాత్రం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, విద్యారంగంలో సంస్కరణలు తెస్తూ 2027 నాటికి నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ దూసుకెళ్తున్నారని విశ్లేషకుడు మస్తాన్ రావు ఈ చర్చలో విశ్లేషించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story