Off The Record: పార్టీ నేతలకు బాబు సీరియస్ క్లాస్
Off The Record: కూటమి సర్కార్ రెండేళ్ల పాలన వేళ ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు కీలక సమీక్ష. అంతర్గత విభాగాలు, నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం.
Off The Record: పార్టీ నేతలకు బాబు సీరియస్ క్లాస్
Off The Record: ప్రభుత్వ పాలన పట్ల ఎంత విజనరీగా ఉంటారో.. నేతల పనితీరుపైనా అంతే స్ట్రిక్ట్‌గా ఉంటారు చంద్రబాబు. పార్టీ లక్ష్యాలను విస్మరించినా, క్రమశిక్షణ గాడి తప్పినా అస్సలు సహించరు. అందుకే నేతల పర్ఫామెన్స్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉంటారు. కూటమి సర్కార్‌కు రెండేళ్లు పూర్తైన సందర్భంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఇంకాస్త దృష్టి పెంచారట.
అక్కడక్కడ గీత దాటి వ్యవహరిస్తోన్న ప్రజాప్రతినిధులకు అక్షింతలు వేశారట. ఎంపీలతో జరిగిన మీటింగ్‌లో పార్టీ అంతర్గత విషయాలు, నేతల గ్రూప్‌వార్ వంటి అంశాలను ప్రస్తావించి కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నారట. పనిలో పనిగా.. కొందరు అధికారుల పనితీరుపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట చంద్రబాబు. ఇంతకు చంద్రబాబు చేరిన.. సర్వే రిపోర్టులో ఏముంది..?చంద్రబాబు ఆగ్రహానికి గురైన నేతలు ఎవరు..?




