సొంత ఇంటి కల నిజం చేసుకునే గోల్డెన్ ఛాన్స్: ఏపీలో ఉచిత ఇళ్ల పట్టాలు.. ప్రాసెస్ ఇదే!

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇళ్ల స్థలాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన పేదలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలో పూర్తి వివరాలు.

Arun Chilukuri
Published on: 17 Oct 2026 3:21 PM IST
సొంత ఇంటి కల నిజం చేసుకునే గోల్డెన్ ఛాన్స్: ఏపీలో ఉచిత ఇళ్ల పట్టాలు.. ప్రాసెస్ ఇదే!
X

ఆంధ్రప్రదేశ్‌లో సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అర్హులైన పేదలందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు నూతన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. సొంత ఇల్లు లేదా ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఎవరు అర్హులు?

దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి.

కుటుంబంలో ఎవరికీ ఎలాంటి సొంత ఇల్లు లేదా స్థలం ఉండకూడదు.

కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి మరియు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఆదాయ పరిమితి కలిగి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే విధానం:

అధికారిక వెబ్‌సైట్ లేదా మీ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయం నుంచి ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పొందవచ్చు.

ఆ దరఖాస్తు ఫారమ్‌లో రేషన్ కార్డు నెంబర్, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, మరియు ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌ను స్పష్టంగా నమోదు చేయాలి.

కావాల్సిన పత్రాలు:

ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ

రేషన్ కార్డు కాపీ

ఆదాయ ధృవీకరణ పత్రం

నివాస ధృవీకరణ పత్రం

ఎక్కడ సమర్పించాలి?

పూరించిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు పైన పేర్కొన్న పత్రాలను జత చేసి మీ పరిధిలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌కు అందజేయాలి. అధికారుల క్షేత్రస్థాయి విచారణ తర్వాత అర్హులకు ఉచిత ఇళ్ల పట్టాలు మంజూరు చేయబడతాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.