స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పట్టుబట్టనుందా? కూటమి సీట్ల కేటాయింపుపై సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు విశ్లేషణ!

News Analysis: ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సీట్ల కేటాయింపు, పవన్ కళ్యాణ్ వ్యూహం, టీడీపీ-జనసేన కూటమి రాజకీయంపై సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు విశ్లేషణను hmtv 'న్యూస్ ఎనాలసిస్' లో చూడండి.

Arun Chilukuri
Published on: 21 Aug 2026 12:35 PM IST
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పట్టుబట్టనుందా? కూటమి సీట్ల కేటాయింపుపై సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు విశ్లేషణ!
X

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పట్టుబట్టనుందా? కూటమి సీట్ల కేటాయింపుపై సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు విశ్లేషణ!

News Analysis: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల (జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్) ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమి పార్టీల్లో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం, పవన్ కళ్యాణ్ వైఖరి మరియు కూటమి అంతర్గత పరిస్థితులపై సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు hmtv న్యూస్ ఎనాలసిస్ వేదికగా విశ్లేషించారు.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం కోసం జనసేన కేవలం 21 సీట్లకు మాత్రమే పరిమితమైందని, అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వ్యూహం కుదరదని కృష్ణాంజనేయులు పేర్కొన్నారు. జనసేన శ్రేణులు, వీర మహిళల ఆకాంక్షలకు అనుగుణంగా తమ బలానికి తగ్గట్లు అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన పార్టీ ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసిందని గుర్తుచేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story