BurningTopic: మళ్లీ యుద్ధం మొదలు ? షాక్ లో ప్రపంచ దేశాలు?
BurningTopic: అమెరికా మరియు ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న శాంతి చర్చల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
BurningTopic: మళ్లీ యుద్ధం మొదలు ? షాక్ లో ప్రపంచ దేశాలు?
BurningTopic: పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు పలకడమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్‌ల మధ్య తొలి విడత శాంతి చర్చలు జరిగాయి. స్విట్జర్లాండ్‌లో అత్యంత విలాసవంతమైన బర్గెన్‌స్టాక్ రిసార్ట్ వేదికగా జరుగుతున్న ఈ చర్చలకు పాకిస్తాన్, ఖతర్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మధ్య కుదిరిన తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ సమావేశాల ప్రధాన లక్ష్యం. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొనగా.. ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ప్రధాన చర్చాకర్త మొహమ్మద్ బాఘేర్ ఘాలిబఫ్ హాజరయ్యారు. సుమారు 80 నిమిషాల పాటు సాగిన తొలి విడత సమావేశంలో యుద్ధ విరమణ అమలు, ఆర్థిక ఆంక్షల సడలింపు, ఇరాన్‌కు చెందిన విదేశీ నిధుల విడుదల, చమురు ఎగుమతులపై పరిమితుల తొలగింపు వంటి అంశాలపై చర్చ జరిగింది.
కాగా చర్చల ఆరంభంలోనే.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు, హర్ముజ్ జలసంధి మూసివేత, ఆర్థిక ఆంక్షలు ప్రధాన అడ్డంకులుగా మారాయి. . తాత్కాలిక ఒప్పందంలోని మొదటి నిబంధన అయిన "అన్ని రంగాల్లో కాల్పుల విరమణ"ను అమెరికా అమలు చేయలేదని ఇరాన్ ఆరోపించింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆగేంత వరకు ఇతర అంశాలపై చర్చలు ముందుకు సాగబోవని ఇరాన్ బృందంలోని సభ్యులు స్పష్టం చేశారు. . ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ సముద్ర మార్గాన్ని ఇరాన్ తాజాగా మళ్లీ మూసేసిన సంగతి తెలిసిందే. లెబనాన్‌లో యుద్ధ పరిస్థితులు కొనసాగుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇరాన్ వివరణ ఇచ్చింది. మరోవైపు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చలను మరింత సంక్లిష్టం చేశాయి. ముఖ్యంగా హిజ్బుల్లాను ఇరాన్ అదుపులో పెట్టాలని, లేదంటే గతవారం చేసిన దాడుల కంటే మరింత తీవ్రంగా దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఇరాన్ ప్రతినిధులు కొద్దిసేపు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
చర్చలు ప్రారంభం కావడానికి ముందు అమెరికా ప్రతిపాదించిన ఉమ్మడి ఫొటో, కరచాలన కార్యక్రమాన్ని కూడా ఇరాన్ తిరస్కరించింది. దానిని మీడియా ప్రదర్శనగా అభివర్ణిస్తూ.. ఘాలిబఫ్, అరాఘ్చీ పాల్గొనలేదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కరచాలనం కోసం ఎదురుచూస్తుండగానే ఇరాన్ విదేశాంగమంత్రి వాకౌట్ చేయడం.. మరోవైపు ఖతార్ ప్రతినిధి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్‌ను పలకరించి జేడీ వాన్స్‌ను పట్టించుకోకపోవడం వైరల్ అయ్యాయి. ఈ పరిణామాలతో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బిత్తరపోయి చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో చర్చించిన దృశ్యాలు చూడొచ్చు. వాన్స్ అదే సమయంలో షరీఫ్, మునీర్ వద్దకు వెళ్లి కొద్దిసేపు మాట్లాడటం కనిపించింది. చర్చల తొలి దశ ప్రారంభం నుంచే ఉత్కంఠభరిత వాతావరణంలో కొనసాగిన ఈ పరిణమాలు జేడీవాన్స్‌కు అవమానంగా భావిస్తున్నారు.
పాకిస్థాన్ ప్రధాని షరీఫ్‌ను పలకరించిన ఖతార్ ప్రధాని.. పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడిని మాత్రం విస్మరించడం దౌత్యపరమైన తిరస్కారం అనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా చర్చలకు ముందు జేడీ వాన్స్ విలేకర్లతో మాట్లాడుతూ.. హర్మూజ్‌ను తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమానికి ముగింపు పలకడం వంటి లక్ష్యాలను తాము ఇప్పటికే సాధించామన్నారు. కలిసికట్టుగా ఇంకెంత సాధించగలం అన్నదే ఇప్పుడు తమ ముందున్న ప్రశ్న అని వ్యాఖ్యానించారు. కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టగలమా..? పశ్చిమాసియాలో సంబంధాలను శాశ్వతంగా మార్చగలమా..? లేదంటే పాత విధానానికే తిరిగి వెళ్తామా..? అనేవే ఇప్పుడున్న ప్రశ్నలు. పాత విధానానికి వెళ్లడానికి మేమైతే మొగ్గు చూపడం లేదు’’ అని వ్యాన్స్ తెలిపారు. లెబనాన్ విషయంలో గొప్ప పురోగతి చోటుచేసుకుందని ఆయన అంటున్నారు.
మరోవైపు ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలను తొలగించింది. స్విట్జర్లాండ్‌లో అమెరికాతో జరిగిన తొలి విడత చర్చల అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. అమెరికా-ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం అమలు పర్యవేక్షణకు ఓ కమిటీ ఏర్పాటు కానుంది. దీంతోపాటు లెబనాన్‌లో ఉద్రిక్తతలను నివారించేందుకు డీకాన్ఫిలిక్షన్ సెల్ ఏర్పాటు చేయనున్నారు. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలను నివారించడానికి అమెరికా-ఇరాన్ మధ్య ఓ కమ్యూనికేషన్ లైన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు తరచూ ఉద్రిక్తతలకు కారణమవుతున్న లెబనాన్ అంశంపై డికాన్ఫిలక్షన్ సెల్‌ను ఏర్పాటు చేయడానికి అమెరికా అంగీకరించింది. ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రతినిధులు తొలివిడత చర్చలు ముగిశాయి. కానీ, సాంకేతిక అంశాలపై ఈ వారం కూడా చర్చలు కొనసాగనున్నాయి.
ఇదిలా ఉంటే ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వ బృందాలు మాత్రం చర్చలు పూర్తిగా విఫలమయ్యాయన్న వార్తలను ఖండించాయి. తొలి దశ చర్చలు సుమారు 80 నిమిషాలు కొనసాగిన తర్వాత ఇరాన్ బృందం అంతర్గత సంప్రదింపుల కోసం తాత్కాలికంగా బయటకు వెళ్లినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇరాన్ ఆర్థిక ఆంక్షల ఉపసంహరణ, నిలిచిపోయిన నిధుల విడుదల, చమురు ఆంక్షలపై సడలింపులు వంటి అంశాలపై సాంకేతిక స్థాయిలో చర్చలు కొనసాగినట్లు వెల్లడించారు. ఖతార్ సహకారంతో కొన్ని కీలక ప్రక్రియలు ప్రారంభమైనట్లు సమాచారం బయటకు వచ్చింది.మొత్తంగా స్విట్జర్లాండ్ వేదికపై జరిగిన ఈ చర్చలు ఒకవైపు ఉద్రిక్తతలు, వాకౌట్లతో సాగినా.. కొంత పురోగతి సంకేతాలు కూడా కనిపించాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తొలి విడత చర్చలు నిలిచిపోయినా.. ముగియలేదని ఇరాన్ అంటోంది ఇప్పుడు రెండో విడత చర్చలు శాంతిని తీసుకువస్తాయా? లేక మరోసారి యుద్ధానికి దారితీస్తాయా? అన్నదే ఆసక్తికరం.




