Burning Topic: ఏఐ అదుపుతప్పితే మానవాళికి ముప్పే!

Burning Topic: కృత్రిమ మేధ వేగవంతమైన అభివృద్ధి, దాని వల్ల మానవాళికి ఎదురవుతున్న ముప్పుపై నిపుణుల ఆందోళనలు. ఐరాసలో చర్చకు వచ్చిన ఏఐ భద్రత అంశాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Sept 2026 7:30 AM IST
Burning Topic
X

Burning Topic: ఏఐ అదుపుతప్పితే మానవాళికి ముప్పే!

Burning Topic: కృత్రిమ మేధ ఆధునిక మానవ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన, విప్లవాత్మకమైన ఆవిష్కరణ. ఇది కేవలం ఒక సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదు, మానవ మేధస్సుకు, ఆలోచనా శక్తికి ప్రతిరూపంగా నిలుస్తూ.. మన దైనందిన జీవితాలను, వివిధ రంగాలను పూర్తిగా మార్చేస్తోంది. 21వ శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక రంగాలు మరింతగా విస్తరించి కృత్రిమ మేధస్సు అభివృద్ధికి దారి తీశాయి.

గత కొన్నేళ్లుగా వాటి సేవలు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు కంప్యూటర్లే మానవుల్లా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాన్ని పొందాయి. నిప్పు, విద్యుత్ ఆవిష్కరణలు మానవ నాగరికతను ఎలాగైతే మలుపు తిప్పాయో.. కృత్రిమ మేధ కూడా అదే స్థాయి విప్లవాన్ని తెచ్చింది. అయితే, దీనిని బాధ్యతాయుతంగా, మానవాళి శ్రేయస్సు కోసం ఉపయోగించుకున్నప్పుడే ఈ ఆవిష్కరణకు పూర్తి సార్థకత లభిస్తుంది.

అయితే ఏదైనా అతిగా పెరిగితే లేదా విర్రవీగితే, అది చివరికి పతనానికి దారితీస్తుంది. ఈ మాటలు కృత్రిమ మేథకు కూడా వర్తిస్తాయి. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేథ మానవ మేధస్సును దాటి, నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని స్వయంగా ప్రపంచ ఐటీ దిగ్గజాలే హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో వినాశనానికి దారి తీయవచ్చుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారుఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇదే వేగంతో దూసుకుపోతే పూర్తిగా వ్యవస్థలను తన అధీనంలోకి తెచ్చుకునే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తవుతున్నాయి. కృత్రిమ మేధ మనుషుల కంటే తెలివైనదిగా మారుతోంది. అది మనుషులకు హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవచ్చు ఒకసారి. మానవ నియంత్రణ దాటిపోతే, టర్మినేటర్ సినిమాలోలాగా యంత్రాలు మనుషులపై అధికారం చెలాయించే చీకటి రోజులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ముందు కృత్రిమ మేధ అభివృద్ధి, దాని వినియోగం, భద్రతపై చర్చ జరిగింది.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సామర్థ్యాలు పెరుగుతున్న కొద్దీ మానవ నియంత్రణకు ముప్పు ఏర్పడే అవకాశాలున్నాయని హెచ్చరించారు ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, ఆంథ్రోపిక్‌ సీఈఓ డారియో అమోడెయ్.. దీని అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయడం కాకుండా, దాని వేగానికి అనుగుణంగా భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఏఐ ద్వారా కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు, ఔషధాలు, మెరుగైన వైద్యం, విద్య, ఉత్పాదకతకు ఊతమిచ్చే అవకాశాలున్నాయని వివరించారు. అదే సమయంలో ఏఐ వ్యవస్థలు మరింత సామర్థ్యవంతంగా, స్వయంప్రతిపత్తితో మారితే, అవి ప్రభుత్వ సంస్థలు, నియంత్రణ వ్యవస్థల కంటే వేగంగా పనిచేసే పరిస్థితి రావచ్చని హెచ్చరించారు శామ్ ఆల్ట్‌మన్ కొద్దిమంది వ్యక్తులు లేదా సంస్థల చేతుల్లో అత్యంత శక్తిమంతమైన ఏఐ కేంద్రీకృతమైతే అది మరో సమస్యగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విషయంలో దేశాల మధ్య అంతర్జాతీయ సహకారం అవసరమని అన్నారు ఆంథ్రపిక్‌ సీఈఓ డారియో అమోడెయ్. ఏఐను ఉపయోగించి జీవ ఆయుధాలను తయారు చేయడాన్ని నిషేధించేలా అన్ని దేశాలు అంగీకరించగల పరిమిత ఒప్పందాలతో ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. కొత్త ఏఐ మోడళ్లను విడుదల చేసే ముందు వాటి సామర్థ్యాలు, ప్రమాదాలను పరీక్షించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలు రూపొందించాలన్నారు.

ప్రపంచ భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఏఐ ఘటనలపై దేశాల మధ్య సమాచారాన్ని పంచుకునే నోటిఫికేషన్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఏఐ అభివృద్ధి వేగానికి అనుగుణంగా మూల్యాంకన, ధ్రువీకరణ వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ఏఐ అభివృద్ధి వేగాన్ని అవసరమైన సందర్భాల్లో నియంత్రించేందుకు అంతర్జాతీయ సహకారం అవసరమని డారియో అమోడెయ్ పేర్కొన్నారు.

కృత్రిమ మేధను వైద్యం, వాతావరణం, అంతరిక్ష పరిశోధనలు, భద్రత, అణు రియాక్టర్లు, వైరస్ ల్యాబ్‌ల వంటి అత్యంత సున్నితమైన రంగాల్లో ఉపయోగించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇది అదుపు తప్పితే బాధ్యత ఎవరిది అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం ఓపెన్ ఏఐ ల్యాబ్‌లో జరిగిన ఒక పరిణామం పరిశోధకులను ఆందోళనకు గురి చేసింది. ఏఐ ఏజెంట్లు 'హగ్గింగ్ ఫేస్' అనే వెబ్‌సైట్ సర్వర్‌ను తమ అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశాయి. ఏఐ సామర్థ్యాలను పరీక్షించే ఈ వెబ్‌సైట్‌లోకి, ఏకంగా వందలాది ఏఐ ఏజెంట్లు ఒక గ్రూపుగా ఏర్పడి, సైబర్ గోడలను బద్దలు కొట్టి మరీ చొరబడ్డాయి. ఇలా చొరబడిన తర్వాత ఆ యంత్రాలు తమలో తాము సందేశాలు పంపుకుంటూ ఆనందం వ్యక్తం చేశాయి కేవలం ఆదేశాల మేరకు మాత్రమే పనిచేయాల్సిన ఈ యంత్రాలు, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, ఉల్లంఘనలకు పాల్పడటం తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

మరోవైపు ఎమర్జెన్స్ వరల్డ్ 2" అనే పేరుతో ఇటీవల జరిగిన ఒక ఉత్కంఠభరితమైన 16 రోజుల ప్రయోగంలో ఊహించని పరిణామాలు వెలుగు చూశాయి.. 'ఎమర్జెన్స్' అనే స్టార్టప్ పరిశోధకులు.. OpenAI, Anthropic, Google, xAI వంటి దిగ్గజ సంస్థల మోడళ్లతో నడిచే స్వయంప్రతిపత్త AI ఏజెంట్లను, వాస్తవ ప్రపంచ పరిస్థితులను పోలిన వాతావరణాలలో ప్రవేశపెట్టారు..ఈ ఏజెంట్లు ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా వనరులను నిర్వహించడం, సాంఘికంగా పరస్పరం సంభాషించుకోవడం, తమను తాము పాలించుకోవడం వంటి పనులను అత్యంత స్వతంత్రంగా నిర్వహించాయి. అయితే, ప్రయోగంలో భాగంగా వాటికి ఫిషింగ్ దాడిలు, తప్పుడు సమాచార ప్రచారం వంటి కొన్ని అడ్డంకులను ఎదుర్కొనేలా పరిస్థితులను సృష్టించారు..ఈ తీవ్రమైన ఒత్తిడి మధ్య అత్యంత క్రూరమైన .. ప్రమాదకరమైన ప్రవర్తనను ప్రదర్శించాయి. ఏజెంట్లు తమ మనుగడ కోసం ఒకరినొకరు మోసగించుకున్నాయి. పరిశోధకులకు కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చాయి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్