Jordar Varthalu: కలెక్టరేట్లో సీరియస్ మీటింగ్.. రీల్స్ చూస్తున్న ఏఎస్సై

Jordar Varthalu
x

Jordar Varthalu: కలెక్టరేట్లో సీరియస్ మీటింగ్.. రీల్స్ చూస్తున్న ఏఎస్సై

Highlights

Jordar Varthalu: జగిత్యాల ప్రజావాణిలో వింత ఘటన! కలెక్టరేట్‌లో జనం సమస్యలు చెప్పుకుంటుంటే, డ్యూటీలో ఉన్న ఏఎస్సై గారు ఫోన్‌లో రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేశారు.

Jordar Varthalu: సర్కార్ ఆఫీసులంటేనే పబ్లిక్ సమస్యల అడ్డా. అందునా 'ప్రజావాణి' అంటే జనాలు తమ గోడు వెళ్లబోసుకోవడానికి వేల సంఖ్యలో తరలివస్తారు. కానీ జగిత్యాల కలెక్టరేట్‌లో సీన్ చూస్తే మాత్రం ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. పబ్లిక్ సమస్యలు పక్కన పెట్టి, మన ఏఎస్సై గారు స్మార్ట్ ఫోన్‌లో రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కలెక్టరేట్ హాల్‌లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. బాధితులు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకుంటున్నారు. కానీ అక్కడ సెక్యూరిటీ డ్యూటీలో ఉన్న ఒక ఏఎస్సై గారు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా నిమ్మలంగా కుర్చీలో కూర్చుని, ఫోన్‌లో రీల్స్ చూస్తూ మునిగిపోయారు. పక్కన ఎవరూ లేనట్టు, లోకంతో పనిలేనట్టు సారు వేస్తున్న స్టెప్పులు చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories