Big Debate: మూడేళ్లలో ప్రాజెక్టుల పూర్తి సాధ్యమేనా? పెండింగ్ పనులపై జలసాధన సమితి ప్రశ్నలు!

Big Debate: ఏపీలో మూడేళ్లలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడం సాధ్యమేనా? హెచ్‌ఎంటీవీ బిగ్ డిబేట్‌లో జలసాధన సమితి నాయకులు శ్రీనివాస్ రాయలసీమ ప్రాజెక్టుల పెండింగ్ నిధులు, నదుల అనుసంధానంపై లేవనెత్తిన కీలక ప్రశ్నలు.

Arun Chilukuri
Published on: 17 July 2026 11:21 AM IST
Big Debate
X

Big Debate: మూడేళ్లలో ప్రాజెక్టుల పూర్తి సాధ్యమేనా? పెండింగ్ పనులపై జలసాధన సమితి ప్రశ్నలు!

Big Debate: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాబోయే మూడేళ్లలో (డిసెంబర్ 2028 నాటికి) రాష్ట్రంలోని పోలవరంతో పాటు దాదాపు 35 నుండి 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని క్యాలెండర్ విడుదల చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'హెచ్‌ఎంటీవీ' (hmtv) నిర్వహించిన బిగ్ డిబేట్‌లో జలసాధన సమితి నాయకులు శ్రీనివాస్ పాల్గొని, ఈ లక్ష్యం ఎంతవరకు ఆచరణ సాధ్యమనే అంశంపై కీలక విశ్లేషణ చేశారు.

డిబేట్‌లో శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేవలం 35 వేల కోట్లతో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. కోస్తాంధ్ర ప్రాంతంలో 60 నుండి 70 శాతం మేర ప్రాజెక్టుల పనులు ఒకవైపు ఉంటే.. కేవలం అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలోని (అనంతపురం జిల్లాతో సహా) పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికే సుమారు 60 వేల నుండి 70 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని గణాంకాలతో వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story