BIG Debate: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామనే భయంతోనే అడ్డుకుంటున్నారు: బీఆర్‌ఎస్ నేత ఫైర్
BIG Debate: ప్రజా సమస్యలపై చర్చకు వస్తే అసెంబ్లీ వద్ద హైడ్రామా సృష్టించారని బిగ్ డిబేట్‌లో బీఆర్‌ఎస్ నేత దుదిమెట్ల బలరాజు మండిపడ్డారు.
BIG Debate: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామనే భయంతోనే అడ్డుకుంటున్నారు: బీఆర్‌ఎస్ నేత ఫైర్
BIG Debate: తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ గేటు వద్ద చోటుచేసుకున్న పరిణామాలు, పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ నేత దుదిమెట్ల బలరాజు హెచ్‌ఎంటివి బిగ్ డిబేట్‌లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టకుండా అడ్డుకునేందుకే అధికార కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దిశానిర్దేశం ప్రకారం తాము అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. ఇచ్చిన హామీలు, రైతాంగ సమస్యలు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రతిరోజు ఒక అజెండాతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. శాసనసభలో 1,000 రోజుల పాలన వైఫల్యాలపై నిలదీస్తామనే భయంతోనే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని విమర్శించారు. నల్ల టీషర్ట్లు, ప్లకార్డులు పార్లమెంట్ స్థాయిలోనూ వాడుతున్నవేనని, వాటిని బూచీగా చూపిస్తూ ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం అన్యాయమని ధ్వజమెత్తారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.




