Big Debate: పదేళ్లలో 152 పేపర్లు లీక్.. విద్యా వ్యవస్థ ఏమైపోతోంది?
Big Debate: దేశంలో గత పదేళ్లలో 152 పరీక్షా పత్రాలు లీక్ కావడంపై హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ డిబేట్‌లో తీవ్ర చర్చ జరిగింది.
Big Debate: పదేళ్లలో 152 పేపర్లు లీక్.. విద్యా వ్యవస్థ ఏమైపోతోంది?
Big Debate: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET) పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం, ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల్లో తలెత్తుతున్న అవకతవకలపై ప్రజాక్షేత్రంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో గత 10 ఏళ్ల కాలంలో దేశంలో దాదాపు 152 ప్రభుత్వ ఉద్యోగ, ప్రవేశ పరీక్షల పేపర్లు లీక్ కావడంపై 'హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ డిబేట్' వేదికగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగింది.
డిబేట్ ప్రారంభంలో యాంకర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ప్రతి ఏటా పరీక్షల నిర్వహణకు ప్రభుత్వాలు రూ. 1.40 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంటే, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం కోచింగ్‌లు, ఫీజుల రూపంలో లక్షల కోట్లు వెచ్చిస్తున్నారని గుర్తుచేశారు. దాదాపు 7.5 కోట్ల కుటుంబాలు ఈ లీకేజీల వల్ల ప్రత్యక్షంగా నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో 152 పేపర్లు లీక్ అయినా ఏ ఒక్కరిపై కూడా సరైన చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి జవాబుదారీతనం వహించారా అని ప్రశ్నించారు.




