Big Debate: అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.. సీఎం చంద్రబాబు క్యాలెండర్‌పై సీపీఎం గఫూర్ ఫైర్!
Big Debate: పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి అసలు కారణమేంటి? సీఎం చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ క్యాలెండర్‌పై హెచ్‌ఎంటీవీ బిగ్ డిబేట్‌లో సీపీఎం నేత గఫూర్ సంచలన వ్యాఖ్యలు. నిధుల కొరత, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీపై నిలదీత.
Big Debate: అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.. సీఎం చంద్రబాబు క్యాలెండర్‌పై సీపీఎం గఫూర్ ఫైర్!
Big Debate: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన 'ఇరిగేషన్ క్యాలెండర్' మరియు మూడేళ్లలో ప్రాజెక్టుల పూర్తి హామీలపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఈ అంశంపై 'హెచ్‌ఎంటీవీ' (hmtv) నిర్వహించిన ప్రత్యేక బిగ్ డిబేట్‌లో సీపీఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ పాల్గొని, ప్రభుత్వ ప్రకటనల తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
డిబేట్‌లో గఫూర్ మాట్లాడుతూ.. "ఉట్టి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్లు" ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల విషయంలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. 2014లో కర్నూలు వేదికగా ప్రకటించిన వేదావతి, గుండ్రేవుల రిజర్వాయర్లు, ఆర్డీఎస్ కాలువల పనులపై గత 12 ఏళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని, కనీసం ఒక తట్టెడు మట్టి కూడా వేయలేదని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ 2028 నాటికే పనులన్నీ పూర్తి చేస్తామనడం ఎంతవరకు సిన్సియారిటీ అని ప్రశ్నించారు.




