Burning Topic: డోనాల్డ్ ట్రంప్ కు అమెరికా బిగ్ షాక్? భారత్ కు గుడ్ న్యూస్
Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టు గట్టి షాక్ ఇచ్చింది!
Burning Topic: డోనాల్డ్ ట్రంప్ కు అమెరికా బిగ్ షాక్? భారత్ కు గుడ్ న్యూస్
Burning Topic: అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన అంతర్జాతీయ పన్నుల విధానానికి అమెరికా సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. విదేశాల నుంచి వచ్చే అన్ని వస్తువులపై 10 శాతం మేర దిగుమతి సుంకాలు విధించాలన్న ఆయన నిర్ణయం చట్టబద్ధం కాదని న్యూయార్క్ ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాల యుద్ధాన్ని ప్రారంభించారు. దీన్ని అమెరికాకు విమోచన దినంగా అప్పట్లో అభివర్ణించారు. చాలా ఏళ్లుగా ప్రపంచ దేశాలతో ఉదారంగా వ్యవహరింస్తుంటే అవి అమెరికాను దోచుకున్నాయని మండిపడ్డారు.. దాదాపు అన్ని దేశాలపై భారీగా సుంకాలను ప్రకటించారు. అయితే అమెరికా సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో అధ్యక్షుడు విధించిన సుంకాలను కొట్టేసింది. దీంతో ట్రంప్ యంత్రాంగం 'ట్రేడ్ యాక్ట్ 1974'లోని సెక్షన్ 122ను ఉపయోగించి జూలై 24 వరకు అమల్లో ఉండేలా ఈ 10 % తాత్కాలిక టారిఫ్‌లను ప్రవేశపెట్టింది
ట్రంప్ పాలనా యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గ్లోబల్ సప్లై చెన్‌లపై ఎక్కువగా ఆధారపడే చిన్న వ్యాపారులు ఈ కేసును దాఖలు చేశారు. అత్యవసర అధికారాల కింద విస్తృత వాణిజ్య జరిమానాలను విధించే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన సుప్రీం కోర్టు మునుపటి తీర్పును తప్పించుకోవడానికే... ట్రంప్ ఈ సుంకాలు తీసుకొచ్చారని వారు వాదించారు. ట్రేడ్ యాక్ట్ 1974లోని 122 నిబంధన 150 రోజుల వరకు తాత్కాలిక సుంకాలను విధించడానికి అనుమతిస్తుంది. కాగా ఖజానాలో 1.2 ట్రిలియన్ డాలర్ల వస్తు వాణిజ్య లోటు, జీడీపీలో సుమారు 4 శాతం కరెంట్ అకౌంట్ లోటును ఉదహరిస్తూ... అమెరికా పెద్ద వాణిజ్య అసమతుల్యతను ఎదుర్కొంటోందని ట్రంప్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ సుంకాలు 1974 వాణిజ్య చట్టం ప్రకారం సమర్థనీయం కాదని న్యాయస్థానం పేర్కొంది.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికా కాంగ్రెస్ ఇచ్చిన అధికారాలను అతిక్రమించారని పేర్కొన్న ఫెడరల్ కోర్టు ఈ 10% సుంకాలు చెల్లవని స్పష్టం చేసింది. ముగ్గురు సభ్యుల ధర్మాసనం 2-1 మెజారిటీతో ఈ తీర్పునిచ్చింది. ప్రభుత్వం ఉదహరించిన వాణిజ్య లోటు చట్టం ప్రకారం నిర్దేశించిన చట్టపరమైన పరిమితిని అందుకోలేదని పేర్కొన్నారు. అయితే, సుంకాల విషయంలో అధ్యక్షుడికి చట్టం మరింత వెసులుబాటు కల్పిస్తుందని ప్యానెల్‌లోని మూడో న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడికి ఉండే వాణిజ్య అధికారాలను ఈ నిర్ణయం అతిక్రమిస్తోందని కోర్టు పేర్కొంది. కేవలం ఎంపిక చేసిన వస్తువులపై కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వచ్చే అన్ని ఉత్పత్తులపై ఒకేసారి పన్ను వేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. విదేశీ వస్తువులపై అదనపు పన్నులు విధిస్తే అమెరికాలోని సామాన్య ప్రజలపై ధరల భారం పెరుగుతుందని, ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని కోర్టు అభిప్రాయపడింది
అమెరికాలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి, చైనా వంటి దేశాలతో వాణిజ్య లోటును తగ్గించడానికి ఈ 10 శాతం టారిఫ్‌లు అవసరమని ట్రంప్ తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే ఆ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. కాగా ప్రస్తుతానికి ఈ తీర్పు పిటిషన్ దాఖలు చేసిన వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే సుగంధ ద్రవ్యాల సంస్థ బర్లాప్ అండ్ బారెల్, బొమ్మల తయారీ సంస్థ బేసిక్ ఫన్ సంస్థలకు మాత్రమే వర్తి్స్తుతుంది. ప్రభుత్వ పరిశోధనా సంస్థల ద్వారా సుంకాలు చెల్లించినందుకు వీరికి ఊరట లభించింది. న్యాయమూర్తులు ప్రతివాదులను 5 రోజుల్లోపు ఈ ఆదేశాన్ని పాటించాలని, ఈ కేసు సంబంధిత దిగుమతిదారులకు వారి డబ్బును తిరిగి చెల్లించాలని ఆదేశించారు. అయితే, ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్ వంటి రంగాలపై విధించిన సుంకాలు యథాతథంగా కొనసాగుతాయి. అవి సుప్రీంకోర్టు పరిధిలోకి రాకపోవడమే అందుకు కారణం.
తాజా ఫెడరల్ కోర్డు తీర్పుతో భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై సుంకాల భారం మరింత తగ్గే అవకాశం ఉంది. భారత్-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందం వల్ల గతంలో ఈ సుంకాల రేటు 18 శాతానికి తగ్గింది. సుప్రీంకోర్టు ట్రంప్ అత్యవసర అధికారాల కింద విధించిన సుంకాలను రద్దు చేసింది. కాగా ట్రంప్ యంత్రాంగం ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. ఇటీవల టారిఫ్ వివాదంలో కూడా అప్పీల్ కోర్టు ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ట్రంప్ మాత్రం తనకు తోచిన రీతిలో ఏదో ఒక దేశంపై టారిఫ్ విధిస్తూ వారిపై ఒత్తిడి తీసుకొచ్చి అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకునేందుకు ఒప్పిస్తున్నారు. ట్రంప్ తన రెండోసారి పదవీకాలంలో దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు టారిఫ్ వాల్ నిర్మించాలని చూస్తుంటే, న్యాయస్థానాలు రాజ్యాంగ పరిధిని గుర్తు చేస్తూ వాటిని అడ్డుకుంటున్నాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి, ముఖ్యంగా భారత్ వంటి మిత్రదేశాలకు సానుకూల పరిణామంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే చైనా, ఈయూ వంటి దేశాలు వస్తువులను అధికంగా ఉత్పత్తి చేస్తూ ధరలను తగ్గిస్తున్నాయనే సాకుతో మరిన్ని కొత్త టారిఫ్‌లు విధించేందుకు ట్రంప్ ప్రభుత్వం అన్వేషిస్తోంది. చైనా, ఈయూ, జపాన్‌తో సహా 16 అమెరికా వాణిజ్య భాగస్వాములు వస్తువులను అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. ఫలితంగా ధరలు తగ్గి అమెరికా తయారీదారులకు నష్టం కలిగిస్తున్నాయా అనే విషయాన్ని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం పరిశీలిస్తోంది. మరోవైపు ట్రంప్ యూరోపియన్ యూనియన్‌కు వార్నింగ్ ఇచ్చారు. జూలై 4 లోగా వాణిజ్య చట్రాన్ని ఆమోదించడంలో విఫలమైతే, ఈయూ నుంచి వచ్చే వస్తువులపై అధిక సుంకాలు విధిస్తామని తెలిపారు. ఈయూ వస్తువులన్నింటిపై సుంకాల రేట్లు పెరుగుతాయని ట్రంప్ సూచిస్తున్నారా లేదా కేవలం ఆటోలకు మాత్రమే వర్తిస్తుందా అనేది స్పష్టంగా తెలియలేదు. గత సంవత్సరం కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని ఇంకా ఖరారు చేయకపోవడంపై ట్రంప్ అసంతృప్తిగా ఉన్నారు.




