Burning Topic: విజయ్ కు బిగ్ షాక్?

Burning Topic: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ (Thalapathy Vijay) ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది!

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 May 2026 7:17 AM IST
Burning Topic
X

Burning Topic: విజయ్ కు బిగ్ షాక్?

Burning Topic: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా దూసుకువచ్చి అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రిక కళగం ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియరైపోయింది. నూతన ప్రభుత్వం ఏర్పాటు దిశగా అనుమతించాల్సిందిగా కోరుతూ టీవీకే అధినేత విజయ్ లోక్‌భవన్‌లో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ను కలిసి లేఖను సమర్పించారు. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో విజయ్‌ పార్టీ 108 స్థానాల్లో నెగ్గింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మెజారిటీ మార్క్ 118 సీట్లు.. అంటే టీవీకేకు పార్టీకి ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్ధతు ప్రకటించింది. దీంతో 108 మంది టీవీకే ఎమ్మెల్యేలు, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో లిస్ట్‌ను ఇచ్చారు. దీంతో ప్రస్తుతానికి సంఖ్యాబలం 113కి చేరింది. విజయ్ మే 8వ తేదీన తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియం ప్రమాణ స్వీకార వేదిక కానుంది.

తమిళనాడు రాజకీయం ఇప్పుడు టీవీకే చుట్టే తిరుగుతోంది. మెజారిటీ సాధించడానికి ఆ పార్టీకి 10 సీట్లు అవసరమయ్యాయి. దీంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు టీవీకేతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు కాంగ్రెస్ ఇంఛార్జ్​ గిరీశ్​ చోడంకర్​ సంతకం చేసిన ఓ లేఖను అధికారికంగా విడుదల చేసింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ తమ మద్దతు కోరారని, సీఎల్పీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. అయితే రాజ్యాంగంపై విశ్వాసం లేని, మతతత్వ శక్తులను చేర్చుకోకూడదని విజయ్​కు షరతు విధించినట్లు వెల్లడించింది. టీవీకే, కాంగ్రెస్​ల కూటమి ప్రభుత్వం కామరాజ్​ పాలన నాటి స్వర్ణయుగాన్ని మళ్లీ తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అంతేకాదు తమ కూటమి ప్రభుత్వం పెరియార్​, అంబేడ్కర్​ అశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని పేర్కొంది. టీవీకే అధినేత విజయ్​, తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంయుక్తంగా తమిళనాడు ప్రజలు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పును గౌరవిస్తున్నారని కాంగ్రెస్​ పేర్కొంది

ప్రభుత్వ ఏర్పాటులో విజయ్‌ టీవీకే పార్టీకి షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించగానే ఆ పార్టీతో డీఎంకే మైత్రి విచ్చిన్నమైంది. ఈ మద్దతు కేవలం ప్రభుత్వ ఏర్పాటుకే పరిమితం కాదని, భవిష్యత్​లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్​సభ, రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఈ పొత్తు కొనసాగుతుందని కాంగ్రెస్ వెల్లడించింది. "పరస్పర గౌరవం, సముచిత స్థానం, ఉమ్మడి బాధ్యత అనే పునాదులపై ఏర్పడిన ఈ కూటమి, కేవలం ప్రభుత్వ ఏర్పాటు కోసమే కాదు. భవిష్యత్ ఎన్నికల కోసం కూడా" అని కాంగ్రెస్ తెలిపింది. ఈ నిర్ణయంపై డీఎంకే తీవ్రంగా మండిపడింది. ఈ పరిణామం డీఎంకేకు మంట పుట్టించింది. కాంగ్రెస్‌ ఐదు స్థానాలు నెగ్గిందే స్టాలిన్‌ వల్ల అని.. టీవీకేతో వెళ్లడం వెన్నుపోటు కిందకే వస్తుందని మండిపడింది. తమిళనాడు కాంగ్రెస్‌ నేతలు ఈ విషయంలో రాహుల్‌ గాంధీని తప్పు పట్టిస్తున్నారని ఆరోపించింది. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని దూరదృష్టి లేనిదిగా అభివర్ణించారు డీఎంకే నేతలు. దీనికి వారు కచ్చితంగా చింతిస్తాన్నారు.

అయితే డీఎంకే‌కు కాంగ్రెస్ నాయకుడు గట్టిగానే సమాధానం ఇచ్చారు. విజయ్‌ టీవీకేకు మద్దతు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాణిక్యం ఠాగూర్‌. ‘‘ఎన్నికల కోసమే డీఎంకేతో పొత్తు పెట్టుకున్నాం. ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజల తీర్పు వైపు మేముంటే తప్పేంటి? అని అన్నారాయన. ఇదే అంశంపై కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. పార్టీలో అంతర్గత చర్చల తర్వాతే నిర్ణయం ప్రకటించాం. సెక్యూలర్‌ కూటమిని ఏర్పాటు చేయాలన్న విజయ్‌ లక్ష్యం సరైందని కాంగ్రెస్‌ భావిస్తోంది. విజయ్‌ చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే మంచి ఫలితాలిస్తాయి అని అన్నారు. కాగా ఎన్నికల సమయంలో ఇండియా కూటమిలోని డీఎంకే, కాంగ్రెస్‌ మధ్య సీట్ల పంపకాల విషయంలో విబేధాలు బయటపడ్డాయి. ఆ సమయంలో ఇండియా కూటమి పేరుతో కాకుండా సెక్యులర్‌ ప్రొగ్రెసివ్‌ అలయన్స్‌ పేరుతో ఎన్నికలకు వెళ్లారు.

మరోవైపు విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే విష‍యం అన్నాడీఎంకేలో ముసలం పుట్టించింది. టీవీకేకి మద్దతు విషయంలో ఆ పార్టీలో రెండు వర్గాల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్‌కి మద్దతు ఇవ్వాలని ఒక వర్గం.. మరో వర్గం ఇవ్వొద్దని వాదించుకుంటున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు చెన్నైలోని అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ షణ్ముగమ్ కార్యాలయాలంలో భేటీ అయ్యారు. టీవీకేతో పొత్తు గురించి ఆలోచించమని తమ పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి కె.పళనిస్వామిని వారు కోరినట్లు తెలుస్తోంది. ఈ భేటీ జరిగిన కాసేపటికే టీవీకే నేత ఆనంద్‌.. పళనిస్వామిని కలిశారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఐదు స్థానాలు రాగా.. ఏఐఏడీఎంకేకు 47 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ఆ బలం సరిపోదు. మరి ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న అన్నాడీఎంకే.. విజయ్‌కు మద్దతు ఇవ్వడంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కీలక సమావేశం జరిగింది తమ ఎమ్మెల్యేలను చేజారకుండా ఆ పార్టీ అప్రమమత్తమైంది. అయినప్పటికీ టీవీకేతో 10 మంది అన్నాడీఎంకేలు టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో, కూటమి నుంచి బయటకు వచ్చి పది మంది.. విజయ్‌కు మద్దతు ఇస్తారా? అనే చర్చ మొదలైంది. కాగా తమ పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని చెబుతున్నాయి అన్నాడీఎంకే వర్గాలు. అయితే హైకమాండ్​ నిర్ణయం కోసం వేచి ఉండాలని చెప్పారు ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి సత్యన్. ఇప్పుడు బంతి విజయ్​ కోర్టులో ఉందని, కలను నిజం చేసుకోవాలంటే అది విజయ్​ వైపు నుంచే రావాలని చెప్పారు. మరోవైపు

అన్నాడీఎంకే మద్దతుపై విజయ్‌ ఏమాత్రం ఆసక్తిగా లేరనే వార్త కూడా ప్రచారంలో ఉంది. జయలలిత హయాంలో అనేక చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు విజయ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story