BIG STORY: శివాంగి సింగ్ పెళ్లికి పాకిస్తాన్‌కు పెళ్లి పత్రికలు!

BIG STORY: బీహార్ మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె వివాహానికి కనీవినీ ఎరుగని రీతిలో 4 లక్షల మందికి విందు, విజేతకు థార్ కారు ఇచ్చే గుర్రపు పందెం ఏర్పాట్లు చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Nov 2026 10:46 AM IST
BIG STORY
X

BIG STORY: శివాంగి సింగ్ పెళ్లికి పాకిస్తాన్‌కు పెళ్లి పత్రికలు! 

BIG STORY: పెళ్లిళ్లంటే బ్యాంకెట్ హాళ్లు, డీజేలు, బంధువుల హడావుడి సహజం. అన్ని వివాహ వేడుకల్లోనూ కనిపించే ద్రుశ్యాలు ఇవి.

అయితే ఏకంగా నాలుగు లక్షల మందికి విందు, దేశవ్యాప్త గుర్రాలతో పందెం, గెలిచిన వారికి మహీంద్రా థార్ కారు బహుమతి..వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. బీహార్‌ ఎమ్మెల్యే, జేడీయూ నేత అనంత్ సింగ్ కుమార్తె వివాహానికి జరగనున్న ఏర్పాట్లు ఇవి.

అనంత్ సింగ్...బీహార్ లో ఈ పేరు తెలియని వారండరు. జేడీ యూ టికెట్ పై మొకామా నుంచి ఆయన ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాగా తన చిన్న కుమార్తె శివాంగి సింగ్ వివాహాన్ని నవంబర్ 25న గ్రాండ్ గా జరిపించేందుకు ఆయన సిద్ధమయ్యారు.

కుమార్తె వివాహ వేడుక కోసం అనంత్ సింగ్ కనీవినీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మౌ నుంచి డెకరేటర్లు తెప్పిస్తు్న్నారు. అలాగే వివాహ మండపాన్ని అలంకరించడానికి విదేశాల నుంచి ప్రత్యేకంగా పూలు తెప్పిస్తున్నారు. కథ ఇక్కడితో ఆగలేదు. బార్హ్ మైదానంలో భారీ గుర్రపు పందెం నిర్వహించనున్నారు.

ఇందులో గెలిచిన గుర్రం యజమానికి మహీంద్రా థార్, రెండో స్థానంలో నిలిచిన వారికి మోటార్ సైకిల్ బహుమతులుగా అందించనున్నారు. అలాగే ముంబై, భోజ్‌పురి కళాకారులతో వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.అయితే పర్యావరణ పరిరక్షణ కోసం బాణసంచా కాల్చడాన్ని పూర్తిగా నిషేధించారు. ముంబై, భోజ్‌పురి కళాకారులతో వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.

కాగా శివాంగి సింగ్ వివాహ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, అసెంబ్లీలో తేజస్వి యాదవ్‌తో పాటు నటుడు సోనూ సూద్‌ తదితరులకు కూడా ఆయన ఆహ్వానాలు పంపారు. అంతేకాదు పెళ్లిళ్లకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు.

భారత్ నుంచే కాకుండా పాకిస్థాన్‌లోని పరిచయస్తులకు కూడా కార్డులు పంపుతున్నానని అనంత్ సింగ్ వెల్లడించారు. అలాగే ప్రజలే తమకు దేవుళ్లని అనంత్ సింగ్ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే, అనంత్ సింగ్ పొలిటికల్ గ్రాఫ్ కొంతకాలంగా పడిపోతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ఇటీవలే జేడీయూ నుంచి ఆయనను బహిష్కరించారు. అంతేకాదు దులార్‌చంద్ యాదవ్ హత్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 1న అనంత్ సింగ్ లొంగిపోవాల్సి ఉంది. ఈ గడువుకు సరిగ్గా వారం రోజుల ముందే ఆయన ఇంట ఈ భారీ వివాహ వేడుక జరగనుండటం విశేషం. ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్