BIG STORY: పంజాబ్‌ రాజకీయాల్లో భారీ ట్విస్ట్!

BIG STORY: 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మరోసారి కలిశాయి. మోదీ హర్షం, కేజ్రీవాల్ విమర్శల మధ్య మారుతున్న పంజాబ్ రాజకీయ సమీకరణాలివే.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Nov 2026 11:16 AM IST
BIG STORY
X

BIG STORY: పంజాబ్‌ రాజకీయాల్లో భారీ ట్విస్ట్!

BIG STORY: పంజాబ్ రాజకీయాలకు సంబంధించి తాజాగా ఒక కీలక పరిణామం సంభవించిది. దాదాపు ఆరు సంవత్సరాల తరువాత శిరోమణి అకాలీదళ్, మరోసారి ఎన్డీయే కూటమిలోకి చేరింది. పంజాబ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బీజేపీ , శిరోమణి అకాలీదళ్ ఒక కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తాయి. కాగా బీజేపీ , అకాలీదళ్ పొత్తు అంశాన్ని అధికారికంగా ప్రకటించారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి అమిత్ షా అలాగే అకాలీదళ్ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఉభయ పార్టీలు...ఒక జట్టుగా పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తాయని నేతలు ప్రకటించారు.

పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.కాగా బీజేపీ అలాగే అకాలీదళ్ పార్టీలు...పోటీ చేసే సీట్ల సంఖ్యపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అయితే బీజేపీ ఎక్కువ సీట్లు అడుగుతున్నట్లు సమాచారం. కాగా 2000లో కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను చేసిన సంగతి తెలిసిందే.

అయితే సదరు రైతు చట్టాలను శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో అదే సంవత్సరం ఎన్డీయే కూటమి నుంచి అకాలీదళ్ వెళ్లిపోయింది . అయితే ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకోవడం రాజకీయంగా అకాలీదళ్ ను దెబ్బతీసింది.

ఈ నేపథ్యంలో పంజాబ్ లో పోగొట్టుకున్న పరపతిని తిరిగి పొందాలంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోకతప్పదని అకాలీదళ్ నాయకులు భావించారు. అసెంబ్లీ ఎన్నికలు తరుముకు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ తో అకాలీదళ్ పొత్తు కుదుర్చుకుంది.

కాగా అకాలీదళ్ తిరిగి ఎన్డీయే కూటమిలోకి చేరడం పై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ , అకాలీదళ్ ది ..సహజసిద్దమైన పొత్తుగా ఆయన అభివ‌ర్ణించారు. అంతేకాదు వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలలో బీజేపీ , అకాలీదళ్ కూటమి విజయం సాధిస్తుందని తాను భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

కొంతకాలంగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జైత్రయాత్ర కొనసాగుతోంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ లో బీజేపీ జయకేతనం ఎగరేసింది. ఈ జైత్రయాత్రలో భాగంగా పంజాబ్ లోనూ పాగా వేయాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. దీంతో పంజాబ్ లో మారుతున్న రాజకీయ సమీకరణలపై ద్రుష్టి పెట్టింది. ఇందులో భాగంగానే అకాలీదళ్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల సమరానికి బీజేపీ రెడీ అయింది.

కాగా బీజేపీతో అకాలీదళ్ పొత్తు పెట్టుకోవడంపై ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ స్పందించారు. ఎన్నికల్లో ప్రయోజనాల కోసమే అకాలీదళ్ తో బీజేపీ పొత్తు పెట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తాము పంజాబ్ ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నామన్నారు.

గత నాలుగేళ్లుగా ఆప్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలే మరోసారి తమకు అధికారం అప్పగిస్తాయన్నారు. అంతేకాదు...బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పంజాబ్ లో మరోసారి ఆప్ గెలవడం ఖాయమన్నారు అరవింద్ కేజ్రీవాల్.

2027లో జరిగే పంజాబ్ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం పంజాబే. దాదాపు ఏడాది కిందట జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కాగా 2022లో పంజాబ్ లో భారీ మెజారిటీ తో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం పంజాబ్ ను ఎలాగైనా నిలబెట్టుకోవాలని పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, గత నాలుగేళ్లుగా పంజాబ్ లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది.అలాగే పార్టీలో అంతర్గత విభేదాలు కూడా కొనసాగుతున్నాయి. వీటితో పాటు గత ఎన్నికల్లో అండగా నిలిచిన శిరోమణి అకాలీదళ్ ఈసారి బీజేపీ శిబిరంలో చేరిపోయింది. ఇవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకి సవాళ్లు విసురుతున్నాయి.ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే, ఈసారి గెలవడం ఆమ్ ఆద్మీ పార్టీకి అంత సులభం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్