News Analysis: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆపే అధికారం ఎవరికీ లేదు: బీజేపీ నేత అజ్జపు శ్రీనివాస్
News Analysis: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆపే అధికారం ఎవరికీ లేదని బీజేపీ నేత అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు.
News Analysis: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆపే అధికారం ఎవరికీ లేదు: బీజేపీ నేత అజ్జపు శ్రీనివాస్
News Analysis: చట్టసభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను లోపలికి వెళ్లకుండా ఆపే అధికారం ఎవరికీ లేదని బీజేపీ నేత అల్జాపూర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు జరిగిన గందరగోళం, పోలీసుల తీరుపై hmtv ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడారు. నినాదాలతో కూడిన టీషర్ట్‌లు వేసుకుని వచ్చారన్న కారణంతో పోలీసులు వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదని, ప్రభుత్వ మెప్పుకోసం కొందరు అధికారులు ఓవర్‌స్మార్ట్‌గా ప్రవర్తించారని విమర్శించారు. మహిళా సభ్యులు, మాజీ మంత్రులు అని చూడకుండా వారిపట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించడాన్ని హైకోర్టు కూడా తప్పుపట్టిందని గుర్తుచేశారు.
అదే సమయంలో ప్రతిపక్ష నేతలు కూడా సంయమనం పాటించాలని శ్రీనివాస్ హితవు పలికారు. సభలో స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, రోడ్లపై రౌడీల మాదిరిగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. కేవలం మీడియాలో హైలైట్ అవ్వడం కోసం తాత్కాలిక ఆవేశంతో ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరిగేలా నాయకులు హుందాగా వ్యవహరించాలని కోరారు.




