Big Debate: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు మా పార్టీ ప్రధాన విధానం: UCCపై బీజేపీ స్పష్టం

Big Debate: దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలనేదే తమ విధానమని బీజేపీ నేత ఆంజనేయ రెడ్డి స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 16 Sept 2026 12:17 PM IST
Big Debate: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు మా పార్టీ ప్రధాన విధానం: UCCపై బీజేపీ స్పష్టం
X

Big Debate: దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలుపై జరుగుతున్న చర్చలో బీజేపీ నేత ఆంజనేయ రెడ్డి స్పష్టమైన వైఖరిని వినిపించారు. జనసంఘ్ ఆవిర్భావం నుంచి కూడా దేశంలో అందరికీ ఒకే పౌర చట్టం (ఉమ్మడి పౌరస్మృతి) ఉండాలనేది తమ పార్టీ ప్రధాన విధానమని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు (ఆర్టికల్ 44) కూడా భవిష్యత్తులో UCCని అమలు చేసే దిశగా ప్రయత్నించాలని స్పష్టంగా చెబుతున్నాయని గుర్తుచేశారు.

UCC అంటే ఎవరి మత విశ్వాసాలలోనో, పూజా విధానాలలోనో జోక్యం చేసుకోవడం కాదని తేల్చిచెప్పారు. కేవలం వివాహాలు, విడాకులు, ఆస్తి హక్కులు, దత్తత వంటి విషయాలలో మాత్రం అన్ని మతాల ప్రజలకు ఒకే చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు.

లా కమిషన్ చేసిన వ్యాఖ్యల కంటే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలే ముఖ్యమని, దేశంలో అందరికీ సమానమైన చట్టాలు ఉండాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్‌లో లివింగ్ రిషెన్‌షిప్‌లను రిజిస్ట్రేషన్ చేయాలని పెట్టడం వెనుక ఉద్దేశం.. సహజీవనం ద్వారా పుట్టి అనాధలవుతున్న పిల్లలకు చట్టపరమైన హక్కులు కల్పించడమేనని వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.