BIG Debate: కాళేశ్వరం రిపేర్లపై కాంగ్రెస్ డ్రామాలు.. బీజేపీ నేత లక్ష్మీనారాయణ ఫైర్
BIG Debate: కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు బీజేపీ నేత లక్ష్మీనారాయణ.
BIG Debate: కాళేశ్వరం రిపేర్లపై కాంగ్రెస్ డ్రామాలు.. బీజేపీ నేత లక్ష్మీనారాయణ ఫైర్
BIG Debate: తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటి విడుదల, మరమ్మతుల అంశంపై రాజకీయం ముదిరింది. 'hmtv' నిర్వహించిన బిగ్ డిబేట్ (BIG Debate) కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకుడు యెండల లక్ష్మీనారాయణ.. అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు, కరువు ముప్పు పొంచి ఉన్నా.. అందుబాటులో ఉన్న నీటి వనరులను ఒడిసి పట్టుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
ఎన్‌డీఎస్ఏ (NDSA) నివేదికల ఆధారంగా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 2023 నవంబర్ 1న ఎన్‌డీఎస్ఏ మొదటిసారి కాళేశ్వరం ప్రాజెక్టులోని సెవెంత్ బ్లాక్ డ్యామేజీలు, అన్నారం, సుందిల్లా బ్యారేజీల రిపేర్లపై స్పష్టమైన సిఫారసులు చేస్తూ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు.




