News Analysis: 'SIR' ప్రక్రియపై కాంగ్రెస్ కుట్ర.. బీజేపీ సంచలన ఆరోపణలు!

News Analysis: తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ) ను ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేయడమే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ సీనియర్ నాయకులు మహేష్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Arun Chilukuri
Published on: 15 July 2026 12:57 PM IST
News Analysis
X

News Analysis: 'SIR' ప్రక్రియపై కాంగ్రెస్ కుట్ర.. బీజేపీ సంచలన ఆరోపణలు!

News Analysis: తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ) ను ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేయడమే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ సీనియర్ నాయకులు మహేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ప్రక్రియ విజయవంతం కాకుండా చూసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కుట్ర పన్నిందని మండిపడ్డారు. హెచ్‌ఎంటీవీ (hmtv) నిర్వహించిన న్యూస్ అనాలసిస్ డిబేట్‌లో ఆయన పాల్గొని అధికార పార్టీ తీరుపై ధ్వజమెత్తారు.

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభంలో 79 శాతం ఓటర్ మ్యాపింగ్ చాలా సులభంగా, విజయవంతంగా పూర్తయిందని మహేష్ గుర్తుచేశారు. అయితే, ఆ తర్వాత ఎన్యుమరేషన్ ఫామ్స్ పంపిణీ, క్షేత్రస్థాయి పరిశీలన మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం ప్రారంభించిందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ (GHMC) పరిధిలో కావాలనే సఫిషియంట్ స్టాఫ్ (సరిపడా సిబ్బందిని) కేటాయించలేదని ఆరోపించారు. సివిక్ డిపార్ట్‌మెంట్‌కు, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి మధ్య కమ్యూనికేషన్ లోపం వల్ల హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో నివసించే వేలాది మంది ప్రజలకు ఇప్పటికీ ఫామ్స్ అందలేదని ఆయన స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story