News Analysis: డైవర్షన్ రాజకీయాలు మాని ప్రజా సమస్యలపై చర్చించాలి.. బీజేపీ డిమాండ్

News Analysis: ప్రజా సమస్యలను గాలికి వదిలేసి దాడులపై చర్చ చేస్తారా అంటూ హెచ్‌ఎంటివి డిబేట్‌లో బీజేపీ నేత మహేష్ నామాని ప్రశ్నించారు.

Arun Chilukuri
Published on: 9 Sept 2026 11:51 AM IST
News Analysis
X

News Analysis: డైవర్షన్ రాజకీయాలు మాని ప్రజా సమస్యలపై చర్చించాలి.. బీజేపీ డిమాండ్

News Analysis: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం వివాదాలు, దాడుల చుట్టూనే చర్చలు నడుపుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి మహేష్ నామాని హెచ్‌ఎంటివి డిబేట్‌లో మండిపడ్డారు. అసెంబ్లీలో 15 రోజులు సమయం అడిగితే కేవలం వారం రోజులకే పరిమితం చేశారని, అందులో రెండు రోజులు వృథా అయ్యాయని ఆరోపించారు.

ధరల పెరుగుదల, 22ఏ భూములు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, సింగరేణి సమస్యలు, చేనేత కార్మికుల సంక్షేమం వంటి కీలక ప్రజా సమస్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కానీ అధికార, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు, సస్పెన్షన్లు, పోలీసుల తీరుపైనే కాలయాపన చేస్తూ అసలు ఎజెండాను డైవర్ట్ చేస్తున్నాయని విమర్శించారు. స్పీకర్‌ను అవమానించిన బీఆర్‌ఎస్‌ నేతలు క్షమాపణ చెప్పాలని, అదే సమయంలో మహిళా ఎమ్మెల్యేల పట్ల ప్రవర్తించిన పోలీసులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story