Big Debate: స్పీకర్‌ను అవమానిస్తే.. శాసనసభనే అవమానించినట్టే!: బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి
Big Debate: సభలో స్పీకర్‌ను అవమానిస్తే యావత్ శాసనసభను అవమానించినట్టేనని బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి అన్నారు.
Big Debate: స్పీకర్‌ను అవమానిస్తే.. శాసనసభనే అవమానించినట్టే!: బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి
Big Debate: సభలో స్పీకర్‌ను అవమానించడం అంటే యావత్ శాసనసభను, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించినట్టేనని బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి hmtv 'బిగ్ డిబేట్' ప్రత్యేక చర్చలో స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నాటి శాసనసభ సంప్రదాయాలను గుర్తుచేస్తూ.. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా, పెద్ద సంఖ్యలో ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ సభాపతి స్థానానికి, సభా సాంప్రదాయాలకు ఎంతో విలువ ఇచ్చేవారని తెలిపారు. గతంలో అప్పటి ప్రతిపక్ష నేతలు కూడా సభా మర్యాదలను కాపాడేవారని, ఒకవేళ పొరపాటున వెల్లోకి వెళ్లినా బహిరంగంగా క్షమాపణలు కోరిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తుచేశారు.
సభలో పార్టీలతో సంబంధం లేకుండా శాసనసభ్యులందరికీ సమాన హక్కులు, అవకాశాలు ఉంటాయని, సభలో స్పీకరే బాస్ అని ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఏ ఒక్కరు స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినా అది మొత్తం శాసనసభకే మచ్చ అని అన్నారు. కేవలం ఐదు రోజులే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రజల సమస్యలపై లోతైన చర్చ జరిగే అవకాశం కోల్పోతున్నామని, ప్రజాస్వామ్య పరిరక్షణకు సభే వేదిక కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.




