News Analysis: పార్లమెంట్ సమయాన్ని వృథా చేయడమే ప్రతిపక్షాల పని: బీజేపీ కౌంటర్

News Analysis: పార్లమెంట్‌లో పేపర్ లీకేజీ నిరోధక బిల్లు చర్చ వేళ ప్రతిపక్షాల రాద్ధాంతాన్ని బీజేపీ నేత రవికుమార్ తీవ్రంగా ఖండించారు.

Arun Chilukuri
Published on: 30 July 2026 11:39 AM IST
News Analysis
X

News Analysis: పార్లమెంట్ సమయాన్ని వృథా చేయడమే ప్రతిపక్షాల పని: బీజేపీ కౌంటర్

News Analysis: దేశ యువత భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతుంటే, ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ సభా సమయాన్ని వృథా చేస్తున్నాయని బీజేపీ నాయకుడు రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ఎమ్‌టీవీ 'న్యూస్ అనాలసిస్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ఎస్‌పై మరియు ప్రధాని, హోం మంత్రుల గైర్హాజరుపై చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టారు.

ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. "బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారని విమర్శిస్తున్నారు. మరి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఆర్ఎస్ఎస్‌లో పనిచేసిన వాళ్ళు లేరా? ఆర్ఎస్ఎస్ అనేది దేశ భక్తి, జాతీయ గౌరవం కోసం పనిచేసే సంస్థ తప్ప ఉగ్రవాద సంస్థ కాదు. దాని భావజాలాన్ని తప్పుబట్టడం సరికాదు" అని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story