News Analysis: బిఆర్ఎస్, కాంగ్రెస్‌లు గన్ పార్క్ వద్ద ముక్కు నేలకు రాసి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి: బీజేపీ డిమాండ్!

News Analysis: తెలంగాణలో గురుకుల పాఠశాలల దుస్థితిపై బీజేపీ సీనియర్ నేత శంకరోళ్ల రవి కుమార్ హెచ్ఎంటీవీ డిబేట్‌లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Arun Chilukuri
Published on: 3 July 2026 11:24 AM IST
News Analysis
X

News Analysis: బిఆర్ఎస్, కాంగ్రెస్‌లు గన్ పార్క్ వద్ద ముక్కు నేలకు రాసి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి: బీజేపీ డిమాండ్!

News Analysis: తెలంగాణలో ప్రభుత్వ గురుకుల పాఠశాలల నిర్వహణ, టెండర్ల వివాదంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగుతున్న పొలిటికల్ హైడ్రామాపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రంగా స్పందించింది. హెచ్ఎంటీవీ (hmtv) నిర్వహించిన ప్రత్యేక రాజకీయ విశ్లేషణ చర్చా వేదికలో బీజేపీ సీనియర్ నాయకులు శంకరోళ్ల రవి కుమార్ పాల్గొని.. గురుకులాల దుస్థితికి గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే కారణమని దుయ్యబట్టారు. రెండు పార్టీల నేతలూ గన్ పార్క్ సాక్షిగా ముక్కు నేలకు రాసి తెలంగాణ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

గురుకులాల పరిస్థితిపై రవి కుమార్ మాట్లాడుతూ.. గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో గురుకులాల్లో కనీస వసతులు, టాయిలెట్లు లేక, పురుగుల అన్నం తినలేక విద్యార్థులు తీవ్ర ఆందోళనలు చేశారని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story