News Analysis: "అంబర్‌పేట్‌లో హిందువుల ఓట్లూ తగ్గాయి": ఓటర్ల జాబితా సవరణపై బిజెపి నేత వెంకట్ రెడ్డి!
News Analysis: తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ డ్రాఫ్ట్‌పై బిజెపి నేత వెంకట్ రెడ్డి హెచ్‌ఎమ్‌టీవీ డిబేట్‌లో మాట్లాడారు.
News Analysis: "అంబర్‌పేట్‌లో హిందువుల ఓట్లూ తగ్గాయి": ఓటర్ల జాబితా సవరణపై బిజెపి నేత వెంకట్ రెడ్డి!
News Analysis: తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) డ్రాఫ్ట్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల గల్లంతుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సుమారు 92.87 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నట్లు వెలువడిన వార్తలపై ప్రముఖ న్యూస్ ఛానెల్ hmtv 'News Analysis' డిబేట్‌లో పలు పార్టీల ప్రతినిధులు స్పందించారు.
ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ అనేది కేవలం రాజకీయం లేదా ఒక నిర్దిష్ట వర్గానికి సంబంధించిన అంశం కాదని, అర్హత కలిగిన ఏ ఒక్క పౌరుడూ ఓటు హక్కును కోల్పోకూడదని అన్నారు.
ఓట్ల తొలగింపుపై కొందరు రాజకీయ విమర్శలు చేస్తున్నారని, అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం అంబర్‌పేట్ వంటి నియోజకవర్గాల్లో హిందువుల ఓట్లు కూడా భారీగా తగ్గాయని వెంకట్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన చాలామంది ఓటర్లు తమ సొంత ఊళ్లలోనే ఓటు హక్కును పొందేందుకు మొగ్గు చూపడం దీనికి ఒక కారణమని వివరించారు.




