కూలీల కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు చేయలేరా..?: రేవంత్ సర్కార్‌ను ప్రశ్నించిన బీజేపీ విఠల్

News Analysis: ఉపాధి హామీ పథకం (వీబీజీ రాంజీ) నిధుల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య 60:40 నిష్పత్తిని బీజేపీ నేత విఠల్ సమర్థించారు.

Arun Chilukuri
Published on: 2 July 2026 11:27 AM IST
కూలీల కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు చేయలేరా..?: రేవంత్ సర్కార్‌ను ప్రశ్నించిన బీజేపీ విఠల్
X

కూలీల కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు చేయలేరా..?: రేవంత్ సర్కార్‌ను ప్రశ్నించిన బీజేపీ విఠల్

News Analysis: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విబిజి రాంజీ (ఉపాధి హామీ) పథకంలో రాష్ట్రాలకు 40 శాతం వాటా విధించడాన్ని బీజేపీ నేత విఠల్ పూర్తి స్థాయిలో సమర్థించారు. hmtv నిర్వహించిన ప్రత్యేక విశ్లేషణలో పాల్గొన్న ఆయన, కేంద్ర-రాష్ట్రాల ఆర్థిక బంధాలు, జీఎస్టీ వసూళ్లు మరియు జాతీయ భద్రత వ్యయాలపై ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు.

విఠల్ దేశ ఆర్థిక వ్యవస్థ, పన్నుల విభజన గురించి మాట్లాడుతూ.. రాష్ట్రాలకు కేంద్రం కంటే ఎక్కువ ఆదాయం వస్తోందని స్పష్టం చేశారు.పెట్రోల్, లిక్కర్‌పై వచ్చే వ్యాట్ (VAT) వంద శాతం రాష్ట్రాలకే చెందుతుందని చెప్పారు.

జీఎస్టీ (GST) ద్వారా వసూలయ్యే ప్రతి ₹100 లో ₹50 నేరుగా రాష్ట్రానికి వెళ్తుండగా, మిగిలిన ₹50 కేంద్రానికి వెళ్తాయి. ఆ ₹50 లో కూడా మోడీ ప్రభుత్వం వచ్చాక ‘డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్’ కింద 42 శాతాన్ని (అనగా దాదాపు ₹22-24) తిరిగి రాష్ట్రాలకే ఇస్తోందని వివరించారు. మొత్తంగా జీఎస్టీలో దాదాపు 74 శాతం ఆదాయం రాష్ట్రాలకే అందుతోందని లెక్కలు చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story