Big Debate: రాహుల్ గాంధీకి రాజీనామా తప్ప వేరే మాట రాదా?: బిజెపి నేత యార్లగడ్డ రామ్‌కుమార్
Big Debate: పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీరుపై బిజెపి నేత యార్లగడ్డ రామ్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Big Debate: రాహుల్ గాంధీకి రాజీనామా తప్ప వేరే మాట రాదా?: బిజెపి నేత యార్లగడ్డ రామ్‌కుమార్
Big Debate: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఏ విషయంపై మాట్లాడినా రాజీనామా డిమాండ్ చేయడం తప్ప మరొకటి తెలియదని బిజెపి నాయకుడు యార్లగడ్డ రామ్‌కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. 'hmtv' నిర్వహించిన బిగ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పార్లమెంట్ సమావేశాల నిర్వహణ మరియు దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై బిజెపి వైఖరిని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ వైఖరిని ఎద్దేవా చేస్తూ.. తొలుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరారని, ఆ తర్వాత హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని క్రమంగా డిమాండ్లు మారుస్తున్నారని రామ్‌కుమార్ ఆరోపించారు. సభలో ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరగకుండా ప్రతిపక్షాలు కావాలనే ఆందోళనలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు.




