BIG Debate: కేవలం సస్పెన్షన్లు, వివాదాల చుట్టూనే రాజకీయం.. హెచ్‌ఎంటివి డిబేట్‌లో బీజేపీ నేత ఫైర్
BIG Debate: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనపై హెచ్‌ఎంటివి డిబేట్‌లో బీజేపీ నేత ఏలేటి లక్ష్మణ్‌రెడ్డి సంచలన విమర్శలు చేశారు.
BIG Debate: కేవలం సస్పెన్షన్లు, వివాదాల చుట్టూనే రాజకీయం.. హెచ్‌ఎంటివి డిబేట్‌లో బీజేపీ నేత ఫైర్
BIG Debate: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల తీరుపై బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ హెచ్‌ఎంటివి డిబేట్‌లో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ఇరు పార్టీలు పరస్పర అవగాహనతో డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి సమస్యలు, 22ఏ భూములు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఉద్యోగుల సమస్యలు వంటి కీలక అంశాలపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కేవలం నల్ల టీషర్ట్లు, వ్యక్తిగత విమర్శలు, సస్పెన్షన్ల చుట్టూనే రాజకీయం తిరుగుతోందని, ప్రజాధనంతో నడిచే అసెంబ్లీని అర్థవంతమైన చర్చల కోసం ఉపయోగించుకోవాలని హితవు పలికారు. ప్రజల అసలు సమస్యలను పక్కదారి పట్టించేలా ఇరు పార్టీల తీరు ఉందని మండిపడ్డారు.




