BIG Debate: విద్యార్థుల భవిష్యత్తే మా ప్రాధాన్యం: పేపర్ లీకేజీల బిల్లుపై బీజేపీ కౌంటర్!

BIG Debate: రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పరీక్షల లీకేజీలపై కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడం సరికాదని ఏపీ బిజెవైఎమ్ నాయకుడు సునీల్ రెడ్డి అన్నారు.

Arun Chilukuri
Published on: 30 July 2026 11:15 AM IST
BIG Debate
X

BIG Debate: విద్యార్థుల భవిష్యత్తే మా ప్రాధాన్యం: పేపర్ లీకేజీల బిల్లుపై బీజేపీ కౌంటర్!

BIG Debate: రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో జరిగే పరీక్షల లీకేజీలకు కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తూ తప్పుబట్టడం ఎంతమాత్రం సరికాదని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా యువమోర్చా (AP BJYM) నాయకుడు సునీల్ రెడ్డి స్పష్టం చేశారు. హెచ్‌ఎమ్‌టీవీ "బిగ్ డిబేట్" కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 'యాంటీ పేపర్ లీక్ బిల్లు' మరియు విద్యార్థుల ఆందోళనలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో ఎక్కడా పేపర్ లీకేజీలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చారిత్రాత్మక బిల్లును తీసుకొచ్చిందని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా లీకేజీలపై ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story