BIG STORY: భయం నీడలో బాలీవుడ్!
BIG STORY: నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు, అమితాబ్ బచ్చన్ నివాసానికి బాంబు బెదిరింపుల ఘటనలతో బాలీవుడ్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
BIG STORY: భయం నీడలో బాలీవుడ్!
BIG STORY: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన సినీ పరిశ్రమను కుదిపేసింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నకు చెందిన కొంత మంది దుండగులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది. అయితే ఈ కాల్పుల ఘటన నుంచి టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడ్డారు. క్రుష్ణ జింకల వేట కేసులో దోషిగా తేలిన నటుడు సల్మాన్ ఖాన్ తో టైగర్ ష్రాఫ్5తో ఉన్న సాన్నిహిత్యమే కాల్పుల ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
కాగా ఇటీవల ముంబై నగరంలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఏకంగా సినీ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసమైన జల్సా కు బాంబు బెదిరింపులు వచ్చాయి.కాగా మూడు వారాల వ్యవధిలో అమితాబ్ నివాసాన్ని టార్గెట్ గా చేసుకుని దుండగులు బెదిరింపులకు పాల్పడటం ఇది మూడోసారి.
కాగా అక్టోబరు 22న ఆయన నివాసమైన జల్సాలో బాంబులు పెడతామన్న బెదిరింపు సందేశాలు వచ్చాయి. దీంతో పోలీసు అధికారులు..వెంటనే దర్యాప్తు చేపట్టారు. అయితే అవి నకిలీ బెదిరింపులని పోలీసు అధికారులు తేల్చారు.
ఇదిలాఉంటే, వరుస బెదిరింపుల నేపథ్యంలో ఇటీవల అమితాబ్ బచ్చన్...తన నివాసం దగ్గర బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచుని అభిమానులతో మచ్చటించారు. ఈ చర్య ద్వారా అభిమానులకు అమితాబ్ కొండంత ధైర్యాన్ని ఇచ్చినట్లయింది.
ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతకు సంబంధించి బాలీవుడ్ ప్రముఖులకు కొన్ని సూచనలు చేశారు.
బహిరంగ ప్రదేశాలకు అలాగే ప్రజలు గుమిగూడే ప్రాంతాలకు వెళ్లవద్దని సినీ ప్రముఖులను కోరారు. అంతేకాదు అభిమానులతో జనసమూహాల మధ్య కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రముఖుల భద్రతపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఈ సూచనలు జారీ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.
మరోవైపు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలున్నాయని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తుల నుంచి పలువురు బాలీవుడ్ ప్రముఖులకు ఇటీవల బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఏమైనా..కొన్ని రోజులుగా బాలీవుడ్ భయం నీడన బతుకుతోంది.ఎప్పుడు ఏ గ్యాంగ్ స్టర్ ఎవరిపై దాడులు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. బాలీవుడ్ వర్సెస్ గ్యాంగ్ స్టర్ లు అన్నట్లుగా ముంబై నగర పరిస్థితి తయారైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులు మరింత అప్రమత్తంగా ఉండాలని ముంబై పోలీసులు సూచించారు.దీంతో పోలీసులు సినీ ప్రముఖులకు భద్రతాపరమైన సూచనలు జారీ చేశారు.




