Off The Record: నిజామాబాద్ బీఆర్ఎస్‌లో జోష్!

Off The Record: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్ వినూత్న నిరసనలు. బాకీ కార్డులతో ఇంటింటికి గులాబీ శ్రేణులు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Sept 2026 7:08 AM IST
Off The Record
X

Off The Record: నిజామాబాద్ బీఆర్ఎస్‌లో జోష్!

Off The Record: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో గులాబీ దళంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జోష్ పెరిగింది. కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ చేరేలా తిరుగుతూ బీఆర్ఎస్ సైన్యం.. రేవంత్ సర్కార్‌ తీరును ఎండగడుతోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై వరుస ఆందోళనలు చేపడుతోంది. అన్ని నియోజకవర్గాలలో ధర్నాలు, ర్యాలీలు, వంటావార్పు నిర్విహిస్తున్నారు. అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ వినూత్న నిరసనలు చేపడుతోంది బీఆర్‌ఎస్. తెలంగాణలో బీఆర్‌ఎస్ ఘోర ఓటమి తర్వాత వినూత్న ఉద్యమాలతో కారు పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

చాలా రోజుల తర్వాత కార్యకర్తలు, నాయకులు భారీగా రోడ్లపైకి చేరి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 420 మీటర్ల ఫ్లెక్సీపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రాసి ప్రజలకు కనిపించేలా ఏర్పాటు చేస్తున్నారు బీఆర్‌ఎస్ నాయకులు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచలనలు, సలహాలతో నియోజకవర్గ ఇన్చార్జీలు పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూరులో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి,

నిజామాబాద్ అర్బన్‌లో బిగాల గణేష్ గుప్తా, బోధన్‌లో షకీల్, నిజామాబాద్‌ రూరల్‌లో బాజిరెడ్డి గోవర్ధన్, కామారెడ్డిలో మాజీ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డిలో జాజాలసురేందర్, జుక్కల్‌లో హనుమంతు షిండే తదితరులుఈ ఆందోళన కార్యక్రమాలను సారథ్యం వహిస్తున్నారు.

బాకీ కార్డులతో ప్రతీ ఇంటికీ వెళ్తూ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఈ ఆందోళనలతో ఓ రకంగా 2028 ఎన్నికలకు కూడా బీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారన్న టాక్ రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది.

వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, కాంగ్రెస్ నేతలు ఎలాంటి పనులు చేయటం లేదని, వెయ్యి రోజుల వరకు తాము ఓపిక పట్టి ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నామని బీఆర్ఎస్‌ నేతలు వివరిస్తున్నారు. రెండో తేదీన ప్రారంభించిన ఈ నిరసన కార్యక్రమంలో 8న ముగియనుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story