News Analysis: అందుకే బీఆర్ఎస్ ఓడిపోయింది: బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి!

News Analysis: తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) పార్టీ ఓటమికి యువతలో ఉన్న తీవ్ర అసంతృప్తి మరియు నిరుద్యోగమే ప్రధాన కారణమని బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి విశ్లేషించారు.

Arun Chilukuri
Published on: 18 July 2026 11:13 AM IST
News Analysis
X

News Analysis: అందుకే బీఆర్ఎస్ ఓడిపోయింది: బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి!

News Analysis: తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరాజయానికి యువత నిరసనే ప్రధాన కారణమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి విశ్లేషించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘యువ సంగ్రామ సభ’ నేపథ్యంలో hmtv డిబేట్‌లో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, రాజకీయ పార్టీల వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన జరిగిందని ప్రకాష్ రెడ్డి గుర్తుచేశారు. ఉద్యోగాలు అంటేనే 25 నుంచి 30 ఏళ్ల లోపు ఉండే యువతకు సంబంధించిన అంశమని, కానీ బీఆర్ఎస్ తన పదేళ్ల పాలనలో యువత ఆశించిన స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించలేకపోయిందని విమర్శించారు. ఒకవేళ బీఆర్ఎస్ హయాంలో యువత సంతృప్తిగా ఉండి ఉంటే.. 2014, 2018 ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలు, గత ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించేవారు కాదని ఆయన స్పష్టం చేశారు. 2018లో నిరుద్యోగ భృతిగా రూ. 2,500 ఇస్తామని హామీ ఇచ్చి, ఐదేళ్ల పాటు నిరుద్యోగులను బీఆర్ఎస్ మోసం చేసిందని మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story