News Analysis: ఆగస్టు గండం.. సీఎం సీటుపై టెన్షన్‌తోనే రేవంత్ టూర్ రద్దు: బీఆర్ఎస్ నేత దిలీప్ రెడ్డి

News Analysis: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు కావడం వెనుక 'ఆగస్టు సంక్షోభం' భయం ఉందంటూ బీఆర్ఎస్ నేత దిలీప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 24 Aug 2026 11:12 AM IST
News Analysis
X

News Analysis: ఆగస్టు గండం.. సీఎం సీటుపై టెన్షన్‌తోనే రేవంత్ టూర్ రద్దు: బీఆర్ఎస్ నేత దిలీప్ రెడ్డి

News Analysis: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా (US) పర్యటన రద్దు కావడంపై రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చ నడుస్తోంది. hmtv డిబేట్‌లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ దిలీప్ రెడ్డి మాట్లాడగా, ఈ పర్యటన రద్దు వెనుక రాజకీయ కారణాలు మరియు కాంగ్రెస్ అంతర్గత విభేదాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో 1984 ఆగస్టులో ఎన్టీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే ప్రభుత్వం కూలిపోవడం, నాదెండ్ల భాస్కర్ రావు అధికారం చేపట్టడం వంటి చారిత్రక పరిణామాలను దిలీప్ రెడ్డి గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లోనూ అంతర్గత అసంతృప్తి పెరిగిపోవడంతో సీఎం సీటు ఎక్కడ పోతుందోనన్న భయంతోనే రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారని ఆరోపించారు.

కొండా సురేఖ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి అనుకూలంగా కేవలం 16 మంది ఎమ్మెల్యేలు, ఒక్క మంత్రి తప్ప మిగతా ప్రధాన మంత్రులెవరూ ప్రెస్ మీట్‌ పెట్టి మద్దతుగా నిలవలేదని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story