News Analysis: బీఆర్ఎస్ కుంభకోణాలు బయటపడతాయనే భయంతోనే అసెంబ్లీ చర్చ నుంచి పారిపోతున్నారు: కాంగ్రెస్ నేత జితేందర్

News Analysis: బీఆర్ఎస్ కుంభకోణాలు బయటపడతాయనే భయంతోనే అసెంబ్లీ చర్చ నుంచి పారిపోతున్నారని కాంగ్రెస్ నేత జితేందర్ హెచ్‌ఎమ్‌టీవీ డిబేట్‌లో ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 15 Sept 2026 12:11 PM IST
News Analysis
X

News Analysis: బీఆర్ఎస్ కుంభకోణాలు బయటపడతాయనే భయంతోనే అసెంబ్లీ చర్చ నుంచి పారిపోతున్నారు: కాంగ్రెస్ నేత జితేందర్

News Analysis: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, మాక్ అసెంబ్లీ మరియు 22ఏ నిషేధిత భూముల అంశంపై హెచ్‌ఎమ్‌టీవీ నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జితేందర్ పాల్గొని బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన కుంభకోణాలు బయటపడతాయనే భయంతోనే ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీలో చర్చకు రాలేదని విమర్శించారు.

గత బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా లక్షలాది ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని, 22ఏ నిషేధిత జాబితా పేరుతో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని జితేందర్ ఆరోపించారు. ఆ బండారాలన్నీ బయటపడతాయనే బీఆర్ఎస్ నేతలు సభలో చర్చ నుంచి పారిపోతున్నారని మండిపడ్డారు.

అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే గందరగోళం సృష్టించి సస్పెండ్‌ అయ్యేలా ప్రవర్తించి, బయట 'మాక్ అసెంబ్లీ' పేరుతో నూతన డ్రామాలకు తెరలేపారని ఎద్దేవా చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.