Big Debate: విద్యార్థులపై దాడి చేస్తే పట్టించుకోరా?: బిఆర్ఎస్ నేత మల్లయ్య యాదవ్ ఆగ్రహం

Big Debate: విద్యార్థులపై భౌతిక దాడులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని బిఆర్ఎస్ నేత బొల్లం మల్లయ్య యాదవ్ ప్రశ్నించారు.

Arun Chilukuri
Published on: 30 July 2026 11:23 AM IST
Big Debate
X

Big Debate: విద్యార్థులపై దాడి చేస్తే పట్టించుకోరా?: బిఆర్ఎస్ నేత మల్లయ్య యాదవ్ ఆగ్రహం

Big Debate: ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై భౌతిక దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. హెచ్‌ఎమ్‌టీవీ "బిగ్ డిబేట్" కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, విద్యార్థుల ఆందోళనలు, వారిపై జరుగుతున్న దాడులు మరియు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. 23 రోజుల పాటు విద్యార్థులు దీక్షలు చేసినా పట్టించుకోని ప్రభుత్వం, నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఇచ్చి హామీల ప్రకారం విద్యార్థులపై కేసులు ఎత్తేయాల్సింది పోయి, ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతతో వారి ఇళ్లపైకి పోలీసులను పంపి అరెస్టులు చేయించడం దుర్మార్గమని మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story