News Analysis: గుజరాత్‌లో ఉన్న కూలి.. తెలంగాణలో ఎందుకు లేదు..?: బీఆర్ఎస్ నేత రాకేశ్

News Analysis: గుజరాత్, ఇతర ఉత్తర భారత రాష్ట్రాలతో పోలిస్తే ఉపాధి హామీ (వీబీజీ రాంజీ) పథకం కూలీల పెంపులో తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్షను బీఆర్ఎస్ నేత చిరుమల్ల రాకేశ్ hmtv విశ్లేషణలో తీవ్రంగా తప్పుపట్టారు.

Arun Chilukuri
Published on: 2 July 2026 11:21 AM IST
News Analysis: గుజరాత్‌లో ఉన్న కూలి.. తెలంగాణలో ఎందుకు లేదు..?: బీఆర్ఎస్ నేత రాకేశ్
X

గుజరాత్‌లో ఉన్న కూలి.. తెలంగాణలో ఎందుకు లేదు..?: బీఆర్ఎస్ నేత రాకేశ్

News Analysis: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం (VBG రాంజీ) కూలీల వేతనాల పెంపుదల విషయంలోను, నిధుల కేటాయింపుల్లోనూ రాష్ట్రాలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోందని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి చిరుమల్ల రాకేశ్ ఆరోపించారు. hmtv నిర్వహించిన ప్రత్యేక విశ్లేషణలో ఆయన పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు.

గుజరాత్, ఒరిస్సా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉపాధి హామీ కూలీలపై కేంద్రం 15 శాతం వరకు వేతనాన్ని పెంచిందని, దీంతో అక్కడ రోజువారీ కూలి రూ. 300 నుంచి రూ. 345కి చేరిందని రాకేశ్ పేర్కొన్నారు.

కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి కేవలం ఒక్క రూపాయి మాత్రమే పెంచి రూ. 307 నుండి రూ. 308 చేశారని, పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 5 రూపాయలు మాత్రమే పెంచారని మండిపడ్డారు. "అన్ని వేళలా గుజరాత్ మోడల్ అని గొప్పలు చెప్పే కేంద్రం.. కూలీల దగ్గరకు వచ్చేసరికి ఆ గుజరాత్ మోడల్‌ను తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదు?" అని ఆయన ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story