News Analysis: కాంగ్రెస్ అంటేనే దళారీ వ్యవస్థ.. భూభారతిపై బీఆర్ఎస్ నేత దత్తాత్రేయ ఫైర్!

News Analysis: తెలంగాణలో ధరణి లొసుగులు, భూభారతి పోర్టల్‌పై రాజకీయ సమరం ముదిరింది.

Arun Chilukuri
Published on: 7 July 2026 11:38 AM IST
News Analysis: కాంగ్రెస్ అంటేనే దళారీ వ్యవస్థ.. భూభారతిపై బీఆర్ఎస్ నేత దత్తాత్రేయ ఫైర్!
X

కాంగ్రెస్ అంటేనే దళారీ వ్యవస్థ.. భూభారతిపై బీఆర్ఎస్ నేత దత్తాత్రేయ ఫైర్!

News Analysis: తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లు, 'ధరణి' లొసుగుల వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ధరణి పోర్టల్‌ను మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'భూభారతి' వల్ల క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి మేలు జరగకపోగా, మళ్లీ దళారుల వ్యవస్థ వేళ్లూనుకుంటోందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ దత్తాత్రేయ ఆరోపించారు. హెచ్‌ఎంటీవీ (hmtv) డిబేట్‌లో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో 60 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను, తండ్రి నుంచి కొడుకులకు జరిగే అన్నదమ్ముల పంపకాలు (మ్యూటేషన్లు) వంటి వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలనే దూరదృష్టితో కేసీఆర్ 'ధరణి' పోర్టల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారని దత్తాత్రేయ గుర్తుచేశారు. కేవలం 15 నిమిషాల్లో స్లాట్ బుక్ చేసుకుని, మూడు రోజుల్లోనే చేతికి పట్టాదారు పాస్ పుస్తకం వచ్చేలా అత్యంత పారదర్శకమైన విప్లవాత్మక మార్పులు చేశామన్నారు. తాను స్వయంగా వంటిమామిడి వద్ద భూమి కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా మూడు రోజుల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయిందని తన సొంత అనుభవాన్ని వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story