News Analysis: రాహుల్ గాంధీకి ఒక రూలా.. మాకు మరో రూలా?: బీఆర్‌ఎస్‌ నేత దిలీప్ రెడ్డి ఫైర్

News Analysis: రాహుల్ గాంధీకి ఒక రూలా.. మాకు మరో రూలా అని బీఆర్‌ఎస్‌ నేత డాక్టర్ దిలీప్ రెడ్డి ప్రశ్నించారు.

Arun Chilukuri
Published on: 8 Sept 2026 12:38 PM IST
News Analysis
X

News Analysis: రాహుల్ గాంధీకి ఒక రూలా.. మాకు మరో రూలా?: బీఆర్‌ఎస్‌ నేత దిలీప్ రెడ్డి ఫైర్

News Analysis: పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ బ్లాక్ టీషర్ట్‌లు వేసుకుని వస్తే తప్పులేనప్పుడు, అసెంబ్లీకి నల్ల దుస్తులు వేసుకుని వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత డాక్టర్ దిలీప్ రెడ్డి hmtv 'బిగ్ డిబేట్' ప్రత్యేక చర్చలో ప్రశ్నించారు. అసెంబ్లీ గేట్ల వద్దే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆపేసి, లోపలికి రానివ్వకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామనే భయంతోనే కేవలం ఐదు రోజులే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా వ్యవహరించడం, చీరలు లాగడం దారుణమని, దీనిపై హైకోర్టు కూడా తప్పుపట్టిందని గుర్తుచేశారు. గతంలో అధికార పక్షం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. నిబంధనల పేరుతో ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని దిలీప్ రెడ్డి హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story