News Analysis: కాళేశ్వరంపై అవాస్తవాలు వద్దు.. కన్నెపల్లి నీటిని తోడండి: బీఆర్ఎస్

News Analysis: అవాస్తవాల వెంట వెళ్లకుండా కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని తోడాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు.

Arun Chilukuri
Published on: 14 July 2026 11:19 AM IST
News Analysis
X

News Analysis: కాళేశ్వరంపై అవాస్తవాలు వద్దు.. కన్నెపల్లి నీటిని తోడండి: బీఆర్ఎస్

News Analysis: తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్న నీటి రాజకీయాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. 'hmtv' నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది పార్టీల మధ్యో, వ్యక్తుల మధ్యో జరుగుతున్న గెట్టు పంచాయతీ కాదని, యావత్ తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు సంబంధించిన అంశమని ఆయన స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు చేస్తోందని బాలరాజు మండిపడ్డారు. 2025 జూలై 31న పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికతో పాటు కాగ్, ఎన్‌డీఎస్ఏ (NDSA) నివేదికలను ఆయన ప్రస్తావించారు. 655 పేజీల ఎన్‌డీఎస్ఏ నివేదికను కేవలం 60 పేజీలకు కుదించి.. అందులో కావాలనే 32 సార్లు కేసీఆర్ పేరు, 19 సార్లు హరీష్ రావు పేరు చేర్చి వారిని బదనాం చేయడానికే కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు. పీసీ ఘోష్ కమిషన్ కోసం రూ.4 కోట్లు ఖర్చు చేసి, 119 మంది సాక్షులను విచారించినా తప్పులు నిరూపించలేకపోయారన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story