News Analysis: యూపీఐ చార్జీల పేరుతో సామాన్యుల జేబుకు చిల్లు: బీఆర్‌ఎస్ నేత తీవ్ర ఆగ్రహం
News Analysis: యూపీఐ లావాదేవీలపై చార్జీలు వసూలు చేయడాన్ని బీఆర్‌ఎస్ నేత నరసింహారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.
News Analysis: డిజిటల్ లావాదేవీలు మరియు యూపీఐ చెల్లింపులపై చార్జీలు వసూలు చేయాలనే నిర్ణయంపై బీఆర్‌ఎస్ నేత నరసింహారెడ్డి తీవ్రస్థధ్దిలో మండిపడ్డారు. దేశంలో ప్రజలందరికీ యూపీఐని అలవాటు చేసి, పూర్తిగా డిజిటల్ పేమెంట్స్‌కు అడిక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చార్జీల పేరుతో సామాన్యులపై భారం మోపడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. ప్రారంభంలో ఉచితంగా సేవలు అందిస్తామని చెప్పి, ఇప్పుడు విదేశీ కంపెనీల ఒత్తిళ్లతో కేంద్ర ప్రభుత్వం చార్జీల వడ్డనకు తెరలేపుతోందని ఆరోపించారు.
2016 నుంచి పదేళ్లపాటు యూపీఐ లావాదేవీలను ఉచితంగా నడిపించి, దేశంలోని 85% శాతానికి పైగా పేమెంట్స్‌ను దీని ద్వారా జరిగేలా చేసి ప్రజలను పూర్తిగా అలవాటు చేశారని తెలిపారు. ఇప్పుడు అకస్మాత్తుగా చార్జీల బాదుడు మొదలుపెట్టడం సరికాదన్నారు.
మర్చెంట్లపై పడే చార్జీలు చివరికి కచ్చితంగా సామాన్య వినియోగదారులపైనే పడతాయని, చిన్న వ్యాపారుల నుంచి కొనుగోలు చేసే సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
గూగుల్ పే, ఫోన్‌పే వంటి విదేశీ (అమెరికా) కార్పొరేట్ సంస్థల ఒత్తిడికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తలొగ్గి, ప్రజలపై ఆర్థిక భారం మోపుతోందని దుయ్యబట్టారు. ప్రారంభంలోనే చార్జీల గురించి స్పష్టత ఇవ్వకుండా ఇప్పుడు నిర్ణయం మార్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.




