News Analysis: ఆ ప్రక్రియతో తీవ్ర గందరగోళం.. సామాన్యుడికి నో యూజ్!

News Analysis: ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ) క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళానికి దారితీసిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 15 July 2026 12:17 PM IST
News Analysis
X

News Analysis: ఆ ప్రక్రియతో తీవ్ర గందరగోళం.. సామాన్యుడికి నో యూజ్!

News Analysis: ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ) క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళానికి దారితీసిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఈ సరికొత్త విధానం వల్ల సామాన్య ఓటర్లకు ఎటువంటి ఉపయోగం లేకపోగా, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ఎంటీవీ (hmtv) నిర్వహించిన న్యూస్ అనాలసిస్ డిబేట్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఓటర్ల జాబితాను నవీకరించడం, చనిపోయిన వారి ఓట్లను తొలగించడం మంచిదే అయినప్పటికీ, అమలు చేయడంలో ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైందని లక్ష్మీ నరసింహారెడ్డి విమర్శించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లుగా (BLO) నియమితులైన ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు ఎలాంటి ముందస్తు శిక్షణ ఇవ్వలేదని ఆరోపించారు. ఓట్లను పూర్వపు రికార్డులతో మ్యాపింగ్ చేయడానికి అవసరమైన పాత ఓటర్ లిస్ట్‌లు బీఎల్ఓల దగ్గర లేవని, దీంతో ఓటర్లనే ఆన్‌లైన్‌లో వెతుక్కోవాలని సిబ్బంది చెబుతున్నారని, ఇది అధికారుల అలసత్వానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story