ఢిల్లీ టూర్ సక్సెస్ కాదు.. అంతా కాలయాపన: బీఆర్ఎస్ నేత నాగేంద్ర గౌడ్!
Nagendra Goud: హైదరాబాద్ మెట్రో విస్తరణపై ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు కేవలం కాలయాపన కోసమేనని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగేంద్ర గౌడ్ విమర్శించారు.
ఢిల్లీ టూర్ సక్సెస్ కాదు.. అంతా కాలయాపన: బీఆర్ఎస్ నేత నాగేంద్ర గౌడ్!
Nagendra Goud: హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడంపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో మండిపడింది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు, కేంద్రంతో చర్చల వెనుక అసలు ఆంతర్యం వేరే ఉందని, ఇదంతా కేవలం ప్రాజెక్టును జాప్యం చేయడానికి ఆడుతున్న నాటకమని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగేంద్ర గౌడ్ ఆరోపించారు. hmtv నిర్వహించిన ప్రత్యేక న్యూస్ అనాలసిస్ చర్చా వేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటూ.. చివరకు ఢిల్లీకి వెళ్లి కథను మళ్లీ మొదటికి తెచ్చిందని నాగేంద్ర గౌడ్ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో విస్తరణపై అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తే.. ఈ ప్రభుత్వం వచ్చి మళ్లీ 'రీడిజైన్' పేరుతో రెండున్నరేళ్లు వృథా చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ కేంద్ర సహకారం, ఎస్బీఐ క్యాప్స్ (SBI Caps) అధ్యయనం, నివేదికలు అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టారని, దీనివల్ల ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అవ్వడం మినహా సాధించేదేమీ లేదని స్పష్టం చేశారు.




