News Analysis: మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల దమనకాండ.. ప్రభుత్వ తీరుపై బీఆర్‌ఎస్‌ ఆగ్రహం

News Analysis: కేసీఆర్ చావును కోరుతున్నారని, మహిళా ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నారని హెచ్‌ఎంటివి డిబేట్‌లో బీఆర్‌ఎస్‌ నేత నిఖిల్ రావు మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 9 Sept 2026 11:59 AM IST
News Analysis
X

News Analysis: మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల దమనకాండ.. ప్రభుత్వ తీరుపై బీఆర్‌ఎస్‌ ఆగ్రహం

News Analysis: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు, రాజకీయ ఉద్రిక్తతలపై హెచ్‌ఎంటివి డిబేట్‌లో బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత నిఖిల్ రావు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే పోలీసులను అడ్డుపెట్టి అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీకి వస్తున్న మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, చీరలు లాగుతూ దమనకాండకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. అంతేకాకుండా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకంగా కేసీఆర్ చావును కోరుతున్నారని, గుండాలను వెంటేసుకుని ఫాంహౌస్ ముట్టడికి యత్నించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యామ్నాయ సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత విమర్శలు, డైవర్షన్ రాజకీయాలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story