Big Debate: వాళ్లే దొంగలు అన్నారు.. ఇప్పుడు వాళ్లతోనే భేటీ ఎందుకు?: బిఆర్ఎస్ నేత నిఖిల్ రావు నిలదీత!
Big Debate: జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను బిజేపి నేతలు దొంగలు, తీవ్రవాదులుగా చిత్రీకరించడంపై బిఆర్ఎస్ నేత నిఖిల్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Big Debate: వాళ్లే దొంగలు అన్నారు.. ఇప్పుడు వాళ్లతోనే భేటీ ఎందుకు?: బిఆర్ఎస్ నేత నిఖిల్ రావు నిలదీత!
Big Debate: జాతీయ స్థాయిలో జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పేపర్ లీకేజీలపై ఉద్యమిస్తున్న విద్యార్థులపై బిజేపి నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు నిఖిల్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. హెచ్‌ఎమ్‌టీవీ (hmtv) నిర్వహించిన 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ బిజేపి ఎంపీల తీరును తీవ్రంగా ఖండించారు.
ఆందోళన చేస్తున్న విద్యార్థులను 'దొంగలు', 'సంఘ విద్రోహ శక్తులు' అని బిజేపి ఎంపీ రఘునందన్ రావు సంబోధించడం దారుణమని నిఖిల్ రావు మండిపడ్డారు. విద్యార్థులను దొంగలని విమర్శించిన బిజేపి నేతలే, మళ్లీ వారితో చర్చలు జరపడం ఏ రకమైన పాలన అని ప్రశ్నించారు. మరో బిజేపి ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విద్యార్థులపై లాఠీఛార్జ్‌ను సమర్థిస్తూ, 'అమెరికాలో ఐతే కాల్చిపారేసేవారు' అని మాట్లాడటం విద్యార్థుల పట్ల బిజేపికి ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ఆరోపించారు.




