News Analysis: ఆర్ఎస్ఎస్ పొలిటికల్ వింగే బీజేపీ.. నిఖిల్ రావు సంచలన వ్యాఖ్యలు!

News Analysis: ఇంత కీలకమైన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతుంటే ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా సభకు ఎందుకు రాలేదని బిఆర్ఎస్ నేత నిఖిల్ రావు ప్రశ్నించారు.

Arun Chilukuri
Published on: 30 July 2026 11:34 AM IST
News Analysis
X

News Analysis: ఆర్ఎస్ఎస్ పొలిటికల్ వింగే బీజేపీ.. నిఖిల్ రావు సంచలన వ్యాఖ్యలు!

News Analysis: దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళానికి దారితీసిన పేపర్ లీకేజీల నిరోధక బిల్లుపై పార్లమెంట్‌లో ఇంత సుదీర్ఘమైన, కీలకమైన చర్చ జరుగుతుంటే సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా సభకు ఎందుకు హాజరు కాలేదని బిఆర్ఎస్ నాయకుడు నిఖిల్ రావు ప్రశ్నించారు. హెచ్‌ఎమ్‌టీవీ 'న్యూస్ అనాలసిస్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, బీజేపీ వైఖరిపై మరియు విద్యార్థుల ఆందోళనలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా నిఖిల్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు సంబంధించిన రాజకీయ విభాగామే భారతీయ జనతా పార్టీ అని, బీజేపీ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందన్నది జగద్విదితమని పేర్కొన్నారు. దేశంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన యాంటీ పేపర్ లీక్ బిల్లు సభలో చర్చకు వచ్చిన సమయంలో దేశ అగ్రనేతలు పార్లమెంట్‌కు రాకుండా గైర్హాజరు కావడం ఏంటని నిలదీశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story